Ayodhya Hundi : తిరుమలను మించిపోయిన అయోధ్య… తొలి రోజు ఎన్నికోట్ల హుండి ఆదాయం వచ్చిందంటే…
Ayodhya Hundi : సుమారు 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన జన్మభూమి కి చేరుకున్నాడు శ్రీ రాముడు. అయోధ్యలో జనవరి 22న సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా రామ మందిరంలో అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది.ఈ వేడుక నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది . మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుక పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే మొదటిరోజు సెలబ్రిటీలకు మాత్రమే […]
Ayodhya Hundi : సుమారు 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన జన్మభూమి కి చేరుకున్నాడు శ్రీ రాముడు. అయోధ్యలో జనవరి 22న సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా రామ మందిరంలో అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది.ఈ వేడుక నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది . మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుక పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే మొదటిరోజు సెలబ్రిటీలకు మాత్రమే బాల రాముని దర్శన అవకాశం కల్పించారు. ఆ మరుసటి రోజు నుంచి అనగా జనవరి 23 మంగళవారం నుంచి సామాన్యులకి కుడా దర్శన అవకాశం కల్పించారు.తొలిరోజే భారీ సంఖ్యలో బాల రాముని దర్శనం చేసుకున్నారు. అంతేకాక కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.
తిరుమల కి భక్తులు ఎలా పోటెక్కుతారో అలాగే బాల రాముని దర్శనం కోసం అంత ఎత్తున భక్తులు విచ్చేసి కానుకలు సమర్పించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తర్వాత రోజు నుండి సామాన్యులకు కూడా అయోధ్య బాలరాముని దర్శనం చేసుకునేందుకు ఆలయ ట్రస్ట్ అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా స్వామివారికి కానుకలు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయని కి రాలేనివారు ఆన్ లైన్ విరాళం అందించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇలా ఆన్ లైన్ కౌంటర్ల విరాళం మూడు కోట్ల 15 లక్షల విరాళం వచ్చినట్లు ఆలయ సభ్యులు అనిల్ మిశ్ర తెలిపారు. అంతేకాక తొలి రోజు రికార్డ్ స్థాయిలో భక్తులు బాల రాముని దర్శనమించుకున్నారు అని ఆలయ ట్రస్ట్ తెలిపారు.
ఇక ఆ ఒక్కరోజు 5 లక్షల మంది భక్తులు బాల రాముని దర్శించుకున్నారు అని వెల్లడించారు. రెండో రోజు రెండు లక్షల 50 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ వేళల్లో మార్పులు చేశారు. అధికారులు ముందుగా ఉదయం ఏడు గంటల నుండి 11:30 వరకు తిరిగి మధ్యాహ్నం నుండి రాత్రి 7 గంటల వరకు దర్శన సమయాలని ఇచ్చారు. కానీ ఇప్పుడు భక్తుల రద్దీ భారీగా ఉండడంతో ఉదయమే 6 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 10 గంటల కు మూసివేస్తున్నారు. దానితో పెద్ద ఎత్తున భక్తులు ఆరు గంటలకే ఆలయానికి చేరుకున్నారు. గడ్డ కట్టించే చలిని లెక్క చేయకుండా క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. రాత్రి ఆలయం మూసేసి వరకు అది అలాగే కొనసాగుతుంది. అయితే ప్రాణ ప్రతిష్ట ముగిసిన రోజు నుండే బాల రాముడు కోటీశ్వరుడు అయ్యాడు.