Ayodhya Sreeram : భాగ్యనగరంలో తయారవుతున్న అయోధ్య రాముని బంగారు పాదాలు…
Ayodhya Sreeram : జగదభి రాముడు , ఏకపత్నివ్రతుడు , సకల సద్గుణ శోభితుడు శ్రీరాముడు. అయితే ప్రస్తుతం భారతదేశంలో శ్రీరామ జన్మభూమి అయినా అయోధ్యలో అత్యంత సుందరంగా దేశ ప్రజలందరూ ఆశ్చర్య పోయేలా రామ మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇక ఈ రామ మందిరంలో రామయ్య ప్రాణ ప్రతిష్ట ఈనెల 22వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 22వ తేదీన దేశంలోని హిందువులందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరాముడు […]
Ayodhya Sreeram : జగదభి రాముడు , ఏకపత్నివ్రతుడు , సకల సద్గుణ శోభితుడు శ్రీరాముడు. అయితే ప్రస్తుతం భారతదేశంలో శ్రీరామ జన్మభూమి అయినా అయోధ్యలో అత్యంత సుందరంగా దేశ ప్రజలందరూ ఆశ్చర్య పోయేలా రామ మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇక ఈ రామ మందిరంలో రామయ్య ప్రాణ ప్రతిష్ట ఈనెల 22వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 22వ తేదీన దేశంలోని హిందువులందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరనునాడు.
ఇప్పటికే చాలా ఏర్పాట్లు పూర్తి కాగా…శ్రీరాముని పాదాలు తయారు చేసే భాగ్యం మన భాగ్యనగరానికి దక్కింది. అయితే ఇప్పుడు హైదరాబాదు గా పిలవబడే మన భాగ్యనగరం అయోధ్య రాముని పాదాలను తయారుచేసే భాగ్యనగరంగా పేరును సుస్థిరం చేసుకుంది. అయితే అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాదులోని బోయినపల్లి లో అనురాధ టింబర్ డిపోలో తయారు కాగా ,శ్రీరాముని రెండు జతల బంగారు పాదాలు కూడా హైదరాబాదు నుండి తయారు చేసి పంపించే విధంగా అవకాశం లభించడం నిజంగా సువర్ణ అవకాశమని చెప్పాలి.
అయోధ్య రామునికి భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ దాదాపు రూ.1.03 కోట్లు విలువచేసే బంగారు పాదాలను రామయ్యకు పంపిస్తోంది. అయితే ఇప్పటికే ఒక జతపాదుకలను శ్రీరామ భజనలతో తీసుకెళ్తున్నారు. మరో జత నేడు ఆకాశం మార్గం గుండా విమానంలో బయలుదేరనున్నాయి. అయితే అయోధ్య శ్రీరాముని పాదుకలను తయారు చేయడం నిజంగా తమ ఫౌండేషన్ చేసుకున్న అదృష్టమని ఫౌండేషన్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి తెలియజేశారు.
https://youtu.be/o6SFFXZOwiQ?si=-TE1ntin8oWGhRJb