Madhurai : అయోధ్య పూర్తయింది ఇప్పుడు మధురలో శ్రీకృష్ణుడి ఆలయం కోసం పోరాటం…..

Madhurai : అయోధ్యలో రామమందిరం పూర్తయింది. బాల రాముడు కొలువు తీరడంతో హిందువుల ఐదు దశాబ్దాల స్వప్నం నెరవేరింది. అయితే ఇప్పటివరకు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసిన వారు ఇక నుంచి మధురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు , ఉపవాసాలు , మాలలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన ఒక ప్రకటనకు పూనారు మధురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం జరిగే వరకు తాను రోజుకి […]

  • Published On:
Madhurai : అయోధ్య పూర్తయింది ఇప్పుడు మధురలో శ్రీకృష్ణుడి ఆలయం కోసం పోరాటం…..

Madhurai : అయోధ్యలో రామమందిరం పూర్తయింది. బాల రాముడు కొలువు తీరడంతో హిందువుల ఐదు దశాబ్దాల స్వప్నం నెరవేరింది. అయితే ఇప్పటివరకు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసిన వారు ఇక నుంచి మధురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు , ఉపవాసాలు , మాలలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ కు చెందిన ఒక ప్రకటనకు పూనారు మధురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం జరిగే వరకు తాను రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. అయితే గతంలో ఆయన అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం కూడా ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఈ ప్రతిజ్ఞ చేశారు.

ఉత్తర ప్రదేశ్ లోని శ్రీకృష్ణుని ఆలయ నిర్మాణం జరిగే వరకు తాను రోజుకి ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. అయితే మదన్ దిలావర్ గతంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని కూడా ప్రతిజ్ఞ చేశారు. అయోధ్య రామ మందిరం నిర్మించాలని అప్పటివరకు మెడలో పూలమాలలు వేసుకొను అని కొన్నేళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట సంబరాలు అంగరంగ వైభవంగా జరగడంతో మదన్ దిలావర్ ప్రతిజ్ఞ తీరిపోయింది. దీనితో ఆయన అభిమానులు మెడలో భారీ పూలమాల వేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడు కళా సేవకుడు అయినా మదన్ ది లావర్ అయోధ్య ప్రారంభ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామగంజన్ సిటీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాలని ధరించి దిక్ష ను విరమించారు. 34 కిలోల బరువున్న పూల మాలను బిజెపి నేతలు ముందుగా శ్రీరాముడికి సమర్పించి ఆ తర్వాత దీవెనగా మదన్ దిలావర్ మెడలో వేశారు. అయితే మదర్ దిలావర్ ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ అయోధ్య రామ మందిరం ప్రతిష్ట నిర్మాణం కోసం చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఎలాంటి పూలమాల మెడలో వేసుకోకపోవడం ఆశ్చర్యకరం.సీ ఇక ర్యాలీలో మదన్ దిలావర్ డమరుకం వాయించారు. ఈ క్రమంలోనే తన కరసేవ జ్ఞాపకాలను వివరించిన మదన్ దిలావర్ శ్రీకృష్ణుని ఆలయం కోసం మరో ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న మహిళ ఇంట్లో భోజనం చేసిన దిలావర్ ఆమెకు ఒక చీర మరియు 50 వేల రూపాయలు కానుకగా ఇచ్చారు.