Ayodhya Mandir : 16 వేల బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం….

Ayodhya Mandir: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది.తాజాగా జనవరి 22న రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలోనే రామ భక్తులు తమ భక్తిని రకరకాలుగా ప్రదర్శించారు. ఒకరు డైమండ్ నెక్లెస్ తో రామ మందిరం చేసి వార్తల్లో నిలవగా మరొక యువకుడు 20 కేజీల పార్లేజీ బిస్కెట్లతో అయోధ్యలోని రామ మందిరాన్ని చెక్కి వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు మరొక వ్యక్తి బియ్యపు గింజలతో రామమందిరాన్ని చేసి హవురా […]

  • Published On:
Ayodhya Mandir : 16 వేల బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం….

Ayodhya Mandir: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది.తాజాగా జనవరి 22న రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలోనే రామ భక్తులు తమ భక్తిని రకరకాలుగా ప్రదర్శించారు. ఒకరు డైమండ్ నెక్లెస్ తో రామ మందిరం చేసి వార్తల్లో నిలవగా మరొక యువకుడు 20 కేజీల పార్లేజీ బిస్కెట్లతో అయోధ్యలోని రామ మందిరాన్ని చెక్కి వైరల్ అయ్యారు. ఇక ఇప్పుడు మరొక వ్యక్తి బియ్యపు గింజలతో రామమందిరాన్ని చేసి హవురా అనిపించారు. ఆ రామయ్య పై తనకున్న భక్తిని ఈ రూపంలో చాటుకున్నాడు. అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఆ రాముని పై ఉన్న దైవాన్ని తనదైన శైలిలో చూపిస్తున్నారు. రామ భక్తితో వారిలోని టాలెంట్లను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు.

artist-prepare-ayodhya-mandir-with-16thousand-rice-grains

నేడు జగిత్యాలకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ గుర్రపు దయాకర్ అయోధ్య రామ మందిరాన్ని తయారుచేసి అందరూ అవ్వక్ అయ్యేలా చేశారు. జగిత్యాల కు చెందిన గుర్రపు దయాకర్ ఈనెల 22న జరిగిన అయోధ్య రామ మందిరం పురస్కరించుకొని బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి సంకల్పించారు. అందుకోసం 16,000 బియ్యపు గింజల 60 గంటలకు పైగా శ్రమించి 5 ఇంచుల వైశాల్యం తో అరచేతిలో ఇమిడేలా రామ మందిరం నమోనా ను తయారు చేశారు. అయితే బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరు తయారు చేయలేదని అటువంటి రామ మందిరాన్ని కళాకారుడిగా తాను తయారు చేయడం తన అదృష్టమని దయాకర్ తెలిపారు.

artist-prepare-ayodhya-mandir-with-16thousand-rice-grains

అంతేకాకుండా ఈ కళాఖండాన్ని ప్రధానమంత్రి మోడీకి బహుమతిగా ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పారు. బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మించినందుకు పలువురు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే జగిత్యాల దయాకర్ టాలెంట్ చుసి నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు. అతని టాలెంట్ కు సలాం కొడుతున్నారు. ఇలాంటి టాలెంట్ కలిగిన వారు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారని కానీ వారికి సరైన ప్రోత్సాహం లభించక వారి టాలెంట్ ను బయట పెట్టుకోలేకపోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.