Vasthu Tips : ఇంటి ముందు చెప్పులు ఇలా పడేస్తున్నారా…అయితే సమస్యలు తప్పవు…

Vasthu Tips : ఈ కాలంలో కూడా చాలామంది వాస్తును నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే వారి ఇంట్లో వస్తువులను కూడా వాస్తు ప్రకారమే పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు కూడా సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. అలాంటి సమయంలోనే వస్తువులను ఉంచే స్థలాన్ని సరైన దిశగా ఎంచుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిలో కేవలం వస్తువులను మాత్రమే కాకుండా బయట […]

  • Published On:
Vasthu Tips :  ఇంటి ముందు చెప్పులు ఇలా పడేస్తున్నారా…అయితే సమస్యలు తప్పవు…

Vasthu Tips : ఈ కాలంలో కూడా చాలామంది వాస్తును నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే వారి ఇంట్లో వస్తువులను కూడా వాస్తు ప్రకారమే పెడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు కూడా సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. అలాంటి సమయంలోనే వస్తువులను ఉంచే స్థలాన్ని సరైన దిశగా ఎంచుకోవడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిలో కేవలం వస్తువులను మాత్రమే కాకుండా బయట వుండే చెప్పులను కూడా సరిగ్గా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

are-you-throwing-your-shoes-in-front-of-the-house-like-this-but-there-are-problems

మనం బయట విడిచే చెప్పులు అయినా సరే క్రమ పద్ధతిలో పెట్టడం చాలా ముఖ్యం. అలా లేనట్లయితే ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయట. అంతేకాక ఇంటి ముందు విడిచిన చెప్పులు తలకిందులుగా ఉన్నట్లయితే లక్ష్మిదేవి ఆగ్రహానికి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయట. అదేవిధంగా ఇంట్లో కూడా చెప్పులని ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే వారికి పేదరికం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

are-you-throwing-your-shoes-in-front-of-the-house-like-this-but-there-are-problems

అలాగే చెప్పులను తలకిందులుగా ఉంచడం వలన ఇంట్లో వారికి సమస్యలు పెరుగుతాయని లక్ష్మి దేవి కూడా ఆగ్రహించి ఇంట్లో ఉండటానికి ఇష్టపడదని నిపుణులు చెబుతున్నారు. చెప్పులు తిరగల పడినట్లయితే ఇంట్లో ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే మన పెద్దలు చెప్పులు బూట్లు తలకిందులుగా కనిపిస్తే వెంటనే సరిచేయమని చెబుతుంటారు. అలా ఉండటం అరిష్టమని చెబుతుంటారు. కావున మన పెద్దల మాటలను గుర్తుంచుకొని ఈ విధానాలను పాటించండి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది.తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.