Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ వచ్చేసింది..ఐదు రాశుల వారికి రాజయోగం తెచ్చేసింది..మీ రాశి ఉందో లేదో చూసేయండి..

Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ పండుగకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈసారి వచ్చే అక్షయ తృతీయకు ఆరు శుభయోగాలు ఏర్పడనున్నాయట. ఈ సమయంలో 12 రాశులలో ఐదు రాశులకు మంచి ప్రయోజనాలు ఉన్నాయట. అయితే ఆ రాశులు ఏంటో ..వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజు మేషరాశిలో , సూర్యుడు రాహు మరియు బుధుడు యొక్క కలయిక జరగబోతుంది. […]

  • Published On:
Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ వచ్చేసింది..ఐదు రాశుల వారికి రాజయోగం తెచ్చేసింది..మీ రాశి ఉందో లేదో చూసేయండి..

Akshaya Tritiya 2023 : అక్షయ తృతీయ పండుగకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈసారి వచ్చే అక్షయ తృతీయకు ఆరు శుభయోగాలు ఏర్పడనున్నాయట. ఈ సమయంలో 12 రాశులలో ఐదు రాశులకు మంచి ప్రయోజనాలు ఉన్నాయట. అయితే ఆ రాశులు ఏంటో ..వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజు మేషరాశిలో , సూర్యుడు రాహు మరియు బుధుడు యొక్క కలయిక జరగబోతుంది. దీనివలన ఆరు శుభయోగాలు కలగనున్నాయి. దీంతో ద్వాదశరాశుల్లో ఐదు రాశుల వారికి శుభప్రదమైన ఫలితాలు కలుగునున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

akshaya-tritiya-has-come-it-has-brought-rajayoga-to-the-five-zodiac-signs-check-if-your-zodiac-sign-is-there

వృశ్చిక రాశి…

ఈ రాశి గల వారికి కొత్త వాహనాలు కొనాలనుకునే ప్రయత్నాలు పలిస్తాయి. అలాగే ఇల్లు భూమి వంటి వాటిపై పెట్టాలంటే అక్షయ తృతీయ రోజు మంచిది. చేసే ప్రయత్నాల వలన మంచి ఫలితాలను అందుకుంటారు.

వృషభ రాశి..

ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. దీంతో ఈ రాశి గల వారికి అక్షయ తృతీయ వేళ రాజయోగం పడుతుంది. పశంసలు దక్కుతాయి. కొత్త దుస్తులు మరియు విలువైన అభరణాలను కొనే అవకాశం ఉంది. కుటుంబంలో ఆప్యాయతలు పెరుగుతాయి.

akshaya-tritiya-has-come-it-has-brought-rajayoga-to-the-five-zodiac-signs-check-if-your-zodiac-sign-is-there

కర్కాటక రాశి..

ఈ రాశి గల వారికి అక్షయ తృతీయ రోజున అద్భుతమైన ఫలితాలు అందుతాయి. ఆరు శుభయోగాల వలన కర్కాటక రాశి వారికి రాజయోగం పడుతుంది. ఈ రోజున వెండి మరియు వజ్రాల వంటి వాటితో శుభ ఫలితాలను అందుకుంటారు.

మేషరాశి…

అక్షయ తృతీయ రోజున మేషరాశిలో చాలా శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ రాశి గలవారు అన్ని రంగాలలో ప్రయోజనాలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. దానధర్మాలు చేయడం మంచిది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు.

సింహరాశి..

ఈ రాశి గల వారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. దీంతో శుభప్రదమైన ఫలితాలను అందుకుంటారు. కొత్త ప్రయత్నాలకు ఇంటి పెద్ద సహచారం ఆశీస్సులు అవసరం. ఈ పవిత్రమైన రోజున మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు..