Ram Mandir : అయోధ్యలో కొత్త దోపిడీ…రాముని పేరు తో కొత్త దందా…

Ram Mandir  : ఇటీవల ప్రారంభించిన అయోధ్య బాల రాముని ఆలయంలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ స్థాయిలో రేట్లు ఫిక్స్ చేసి విక్రయిస్తూ కొన్ని హోటల్స్ కస్టమర్లను నిండా ముంచేస్తున్నాయి. బాల రాముని ఆలయ ప్రాంగణంలో మంచి సేవలు అందించాల్సింది పోయి వారి స్వలాభాన్ని చూసుకుంటూ కస్టమర్లను ముంచేసే ప్రయత్నాలు , వారిని నాన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అయోధ్యలో […]

  • Published On:
Ram Mandir : అయోధ్యలో కొత్త దోపిడీ…రాముని పేరు తో కొత్త దందా…

Ram Mandir  : ఇటీవల ప్రారంభించిన అయోధ్య బాల రాముని ఆలయంలో సరికొత్త దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఆహార పదార్థాలను సాధారణ ధరలకు కాకుండా భారీ స్థాయిలో రేట్లు ఫిక్స్ చేసి విక్రయిస్తూ కొన్ని హోటల్స్ కస్టమర్లను నిండా ముంచేస్తున్నాయి. బాల రాముని ఆలయ ప్రాంగణంలో మంచి సేవలు అందించాల్సింది పోయి వారి స్వలాభాన్ని చూసుకుంటూ కస్టమర్లను ముంచేసే ప్రయత్నాలు , వారిని నాన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయినప్పటినుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి అందరికీ తెలిసిందేే. ఈ క్రమంలో ఇదే అదునుగా భావించిన కొన్ని రెస్టారెంట్లు వారి హోటల్లోని ఆహార పదార్థాలకు భారీగా రేట్లు పెంచేశారు. ఈ క్రమంలో ఒక రెస్టారెంట్ చేసిన నిర్వాహకం చూస్తే ఎవరైనా సరే నోరేళ్లపెట్టాల్సిందే…

The total bill for two cups of tea and two ‘white toast’ amounted to Rs 252, after taxes. (Photo Credits: X)

అయితే ఆ రెస్టారెంట్ పేరు శబరి రసోయి. బాల రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ రెస్టారెంట్ ని కొత్తగా ప్రారంభించడం జరిగింది.అయితే ప్రస్తుతం బాల రాముని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు కాబట్టి ఇక్కడ హోటల్ ప్రారంభిస్తే బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఉద్దేశంతో రెస్టారెంట్ ను ఇక్కడ స్థాపించారు. అయితే వారు భావించినట్లుగానే కస్టమర్లు అధిక సంఖ్యలో రావడం చూసిన రెస్టారెంట్ యాజమాన్యం మరింత కక్కుర్తి పడి ధరలను అమాంతం పెంచేసింది. ఈ క్రమంలోనే పది రూపాయలకి అమ్మాల్సిన టీ ధరను ఏకంగా 55 రూపాయలకు పెంచేశారు. అదేవిధంగా ఒక్కొక్క పాట్ ధరను 65గా కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆ రెస్టారెంట్ కి వెళ్ళిన ఒక కస్టమర్ రెండు టీలు రెండు పోట్స్ ఆర్డర్ చేయగా అతని దగ్గర నుండి జీఎస్టీతో కలిపి మొత్తం 252 రూపాయలను హోటల్ యాజమాన్యం తీసుకున్నారు.

ఇక ఈ బిల్లు చూసి కంగుతున్న సదరు కస్టమర్ ఇదేంటని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. అయితే హోటల్ యాజమాన్యం మాత్రం ఇక్కడ ఇలాగే ఉంటుందంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆవేదన చెందిన కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అయోధ్యలో రాముడు పేరుతో కొంతమంది దుర్మార్గులు దారుణంగా దోచుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా ఉందో మనకు తెలిసిందే కదా. ఈ పోస్టు అలా పెట్టగానే కొద్దిసేపటికే నెట్టింటా తెగ వైరల్ అయింది. ఇక ఇదే విషయం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వద్దకు చేరింది. దీంతో అధికారులు సదర్ హోటల్ కు నోటీసులు జారీ చేశారు. మరో మూడు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని లేకపోతే ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.