Viral News : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…కట్నం కోసం అబార్షన్ చేశాడు…చివరికి ఇలా…

Viral News : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ప్రేమించుకుని కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు.కులమత బేధాలను పక్కనపెట్టి పెద్దలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎదిరించి మరి పెళ్లిలు చేసుకుంటున్నారు. ఇక అలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిలో చాలా కొద్ది మంది మాత్రమే కలకాలం కలిసి కాపురాలు చేస్తున్నారు. మరికొందరు పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత ఒకలా ప్రవర్తించడంతో తన భాగస్వామి ఇబ్బంది పడుతూ ఉంటుంది.అయితే అలాంటిదే ఇప్పుడు ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కులమతాలు వేరైనప్పటికీ […]

  • Published On:
Viral News : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…కట్నం కోసం అబార్షన్ చేశాడు…చివరికి ఇలా…

Viral News : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ప్రేమించుకుని కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు.కులమత బేధాలను పక్కనపెట్టి పెద్దలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎదిరించి మరి పెళ్లిలు చేసుకుంటున్నారు. ఇక అలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిలో చాలా కొద్ది మంది మాత్రమే కలకాలం కలిసి కాపురాలు చేస్తున్నారు. మరికొందరు పెళ్లికి ముందు ఒకలా పెళ్లి తర్వాత ఒకలా ప్రవర్తించడంతో తన భాగస్వామి ఇబ్బంది పడుతూ ఉంటుంది.అయితే అలాంటిదే ఇప్పుడు ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కులమతాలు వేరైనప్పటికీ ప్రేమించినవాడు కావాలనె కోరికతో పెద్దలను ఎదిరించి మరీ ఓ యువతీ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తర్వాత మూడు నెలల వరకు అంతా సాఫీగానే సాగినప్పటికీ అసలు కథ అప్పుడు మొదలైంది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి కావడం…ఇక వరకట్నం తెచ్చేంత వరకు పిల్లలు కనేది లేదంటూ భర్త మరియు అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలకు గురి చేయడం తో ఆమె ఇటీవల కన్నుమూసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే….

he-fell-in-love-and-got-married-had-an-abortion-for-dowry-in-the-end-like-this

ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది. అయితే అదే ప్రాంతానికి చెందిన శివ కావ్య ( 26 )అనే అమ్మాయి వడ్ల భరత్ అనే అబ్బాయిని ప్రేమించింది. కులాలు వేరైనప్పటికీ పెద్దలను ఎదిరించి మరి 6 సంవత్సరాల క్రితమే వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మూడు నెలల వరకు వీరి బంధం బాగానే కొనసాగింది. ఆ తర్వాత శివ కావ్య గర్భవతి అవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో భరత్ మరియు వారి కుటుంబ సభ్యుల నుండి వరకట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శివ కావ్యకు ఒక బాబు కూడా జన్మించాడు. అయితే ఆ తర్వాత కూడా శివ కావ్య పలుమార్లు గర్భం దాల్చడం జరిగిందట. ఈ నేపథ్యంలో కావ్య భర్త ఆమెకు తెలియకుండా అబాషన్ మాత్రలులు వేయడం , వరకట్నం తీసుకొచ్చిన తర్వాతనే పిల్లల్ని కణాలని వేధించడం మొదలుపెట్టాడని కావ్య తండ్రి తెలియజేశారు.

ఈ క్రమంలోనే వేధింపులు తట్టుకోలేని కావ్య పలుమార్లు ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించిందట. చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కావ్య తల్లిదండ్రులు తెలియజేశారు. అలాగే పెద్దల సమక్షంలో భరత్ ను మందలించి కావ్యను తిరిగి కాపురానికి పంపగా వారి బుద్ధి మాత్రం మారలేదని కావ్య తల్లిదండ్రులు వాపోయారు. అయితే ఎక్కువసార్లు అబార్షన్ మాత్రలు మింగడం , మరియు మానసిక వేదనకు గురవడంతో గత కొన్ని నెలలుగా కావ్య అనారోగ్యం భారిన పడింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో కావ్యకు చికిత్స అందించడం జరిగింది. అయితే అక్కడ కూడా కావ్య భర్త భరత్ ఆమెను మానసికంగా వేధించడంతోపాటు ఆమె తల్లిపై దాడికి దిగడంతో ఆందోళనకు గురైన కావ్య హార్ట్ బీట్ పెరిగి మరణించినట్లుగా తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భరత్ మరియు వారి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.