Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం…ఎప్పుడంటే..

Dawood Ibrahim : ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముంబైలో బాంబులు పెట్టి కొన్ని వందల మందిని చంపి పాకిస్తాన్ పారిపోయిన దేశద్రోహి. అయితే దావూద్ ఇబ్రహీం భారతదేశంలో ఉన్నప్పుడు బాగానే ఆస్తులు సంపాదించుకున్నాడు. అయితే మన దేశం నుంచి పారిపోయిన తర్వాత ముంబైలోని దావూద్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక ఇప్పుడు దావూద్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించుకుంది. అయితే […]

  • Published On:
Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం…ఎప్పుడంటే..

Dawood Ibrahim : ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముంబైలో బాంబులు పెట్టి కొన్ని వందల మందిని చంపి పాకిస్తాన్ పారిపోయిన దేశద్రోహి. అయితే దావూద్ ఇబ్రహీం భారతదేశంలో ఉన్నప్పుడు బాగానే ఆస్తులు సంపాదించుకున్నాడు. అయితే మన దేశం నుంచి పారిపోయిన తర్వాత ముంబైలోని దావూద్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక ఇప్పుడు దావూద్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ వేలం 2024 జనవరి 5 జరగనున్నట్లు సమాచారం.

దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం#dhavudibramhim #telugufacts #telugucurrentaffairs #currentaffairs#telugu - YouTube

అయితే ముంబైలో ఖేడ్ తాలూక పరిధిలో రత్నగిరి ప్రాంతంలో దావూద్ ఇబ్రహీం కి చెందిన ఒక బంగ్లా మరియు మామిడి తోట ఉన్నాయి. వీటితోపాటు మరో నాలుగు ఆస్తులు సైతం రత్నగిరి ప్రాంతంలో దావూద్ కు ఉన్నట్లు సమాచారం. అయితే వీటన్నింటినీ 10 ఏళ్ల క్రితమే గుర్తించిన ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇప్పుడు వేలం వేసేందుకు ప్రకటించింది.దావూద్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఆస్తులను కేంద్ర ప్రభుత్వం గతంలో వేలం వేయడం జరిగింది.

ఇక దానిలో పెట్రోల్ పంపు , 6 అపార్ట్మెంట్లు, ఒక రెస్టారెంట్ ఒక గెస్ట్ హౌస్ ఉన్నాయి. అయితే ఈ ఆస్తులను దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్ కార్యకలాపాల ద్వారా అక్రమ సంపాదనతో సంపాదించినట్లు సమాచారం. అంతేకాక వీటిని తన పేరుతో పాటు తన కుటుంబ సభ్యుల , చుట్టాల పేరుతో కూడా రిజిస్టర్ చేయించాడు. ఇక వీటన్నింటిని గుర్తించిన ప్రభుత్వం గత 10 ఏళ్లు గా ఆస్తులను వేలం వేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఖేడ్ తాలూకా రత్నగిరి ప్రాంతంలో ఉన్న మామిడి తోట మరియు బంగ్లాను 2024 జనవరి 5న వేలం వేసేందుకు నిర్ణయించుకున్నట్లుగా నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.