Dragon Fruit : కరువు నేలలో కాసులు కురిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట…

Dragon Fruit : మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రాంతానికి కిరాక్ అడ్రస్ అంటే రాయలసీమ అని అంటారు. అయితే అలాంటి కరువు నేలల్లో కూడా కొందరు రైతులు సిరులు పండిస్తున్నారు. వ్యవసాయానికి వారి టెక్నాలజీని ఉపయోగించి ఎడారి ప్రాంతంలో కూడా కాసుల పంటను సాగుచేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా పరమంచాల గ్రామానికి చెందిన రైతు భోజిరెడ్డి రాజారెడ్డి తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఎకరానికి 5 లక్షల చొప్పున పెట్టుబడితో […]

  • Published On:
Dragon Fruit : కరువు నేలలో కాసులు కురిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంట…

Dragon Fruit : మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు ప్రాంతానికి కిరాక్ అడ్రస్ అంటే రాయలసీమ అని అంటారు. అయితే అలాంటి కరువు నేలల్లో కూడా కొందరు రైతులు సిరులు పండిస్తున్నారు. వ్యవసాయానికి వారి టెక్నాలజీని ఉపయోగించి ఎడారి ప్రాంతంలో కూడా కాసుల పంటను సాగుచేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా పరమంచాల గ్రామానికి చెందిన రైతు భోజిరెడ్డి రాజారెడ్డి తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో ఎకరానికి 5 లక్షల చొప్పున పెట్టుబడితో పింకు డ్రాగన్ పంటను సాగు చేయడం మొదలుపెట్టాడు. సాగు చేపట్టిన 10 నెలల తర్వాత పంట కాపు కాయడం మొదలు పెట్టింది. ఇక ఇప్పుడు ఎకరాకి 6 టన్నుల చొప్పున నాలుగు ఎకరాలకు కలిపి 24 టన్నులుల దిగుబడి వస్తున్నట్లుగా రైతు భోజిరెడ్డి రాజారెడ్డి తెలియజేశారు.

the-dragon-fruit-crop-that-is-pouring-cash-in-the-drought-soil

అయితే డ్రాగన్ ఫ్రూట్ కి ఎంత వాల్యూ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఒక టన్ను మార్కెట్లో దాదాపు 1.4 లక్షల రూపాయలు పలకడం గమనార్హం. అయితే బీటెక్ పూర్తిచేసిన రాజారెడ్డి 14 సంవత్సరాల పాటు దుబాయ్ లో ఓ ప్రముఖ చాక్లెట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేశారట.  అయితే అక్కడ లక్షల రూపాయల జీతం పొందుతున్నప్పటికీ కరోనా నేపథ్యం లో ఆరోగ్యం పట్ల అతనికి వచ్చిన వినూత్న ఆలోచన ఈరోజు తన సొంత గ్రామంలో లక్ష రూపాయలను సంపాదించే డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసేందుకు పునాది అని ఆయన తెలిపారు.

the-dragon-fruit-crop-that-is-pouring-cash-in-the-drought-soil

అంతేకాక ఇలాంటి పంట సాగు చేయాలనుకునే వారికి మొక్కలను పెంచడంతోపాటు వారికి సాగు విధానాన్ని కూడా ఉచితంగా నేర్పిస్తానని ఆయన తెలియజేస్తున్నారు. అంతేకాక రైతు పంటను మార్కెటింగ్ చేసేందుకు కూడా తాను సహాయపడతానంటూ రాజారెడ్డి తెలియజేశారు. ఇక పెద్దపెద్ద చదువులు చదివి ఉద్యోగం రాలేదని నిరుద్యోగులుగా ఉంటున్న ఎవరైనా వ్యవసాయం చేయాలనుకుంటే ఈ రైతుల ను ఆదర్శంగా తీసుకుని చేయవచ్చు. ఇక ఈ రైతును సంప్రదించాలనుకునేవారు ఆయన ఫోన్ నెంబర్ 91548 71980 ద్వారా సంప్రదించవచ్చు.