Tata Nexon : మంటల్లో టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ వాహనాలు .. భయాందోళనలో కస్టమర్స్ .. దీనికి కంపెనీ వివరణ ఏంటి ..?

Tata Nexon  : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు జనాలను బాగా ఆకర్షించాయి. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ కి చెందిన పాపులర్ టాటా నెక్సాన్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. అయితే ఇటీవల ఈ ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగడం ఆందోళన రేపింది. పూణె లో చోటు చేసుకున్న ఈ ఘటనలో మంటల్లో కారు కాలిపోయింది. అయితే అధికారులు మంటలను ఆర్పేందుకు […]

  • Published On:
Tata Nexon : మంటల్లో టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ వాహనాలు .. భయాందోళనలో కస్టమర్స్ .. దీనికి కంపెనీ వివరణ ఏంటి ..?

Tata Nexon  : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు జనాలను బాగా ఆకర్షించాయి. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ కి చెందిన పాపులర్ టాటా నెక్సాన్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. అయితే ఇటీవల ఈ ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు చెలరేగడం ఆందోళన రేపింది. పూణె లో చోటు చేసుకున్న ఈ ఘటనలో మంటల్లో కారు కాలిపోయింది. అయితే అధికారులు మంటలను ఆర్పేందుకు కృషి చేశారు దీనిపై టాటా మోటార్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

tata-nexon-electric-vehicles-on-fire-customers-in-panic-what-is-the-companys-explanation-for-this

అయితే ఇటీవల జరిగిన టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహన అగ్ని ప్రమాదానికి కారణం అనధికార సర్వీస్ సెంటర్లో లెఫ్ట్ హెడ్ లాంప్ ను సరిగా మార్చకపోవడం వలన ప్రమాదం జరిగిందని వెల్లడించింది. దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగాయని ప్రకటనలో వెల్లడించింది. అనధికార సర్వీస్ సెంటర్ కు సంబంధిత వర్క్ షాప్ లో ఫిట్మెంట్, రిపేర్ లో లోపాలు ఉన్నాయని హెడ్ లాంప్ ఏరియాలో విద్యుత్ లోపం కారణంగా కారులో మంటలు రావడానికి కారణం అయిందని వివరించింది. బాధిత కస్టమర్ కు అన్ని రకాలుగా సాయం చేస్తున్నట్లు టాటా నెక్సాన్ కంపెనీ తెలిపింది.

tata-nexon-electric-vehicles-on-fire-customers-in-panic-what-is-the-companys-explanation-for-this

ఆటోమోటివ్ మార్కెట్ నిరంతరం కొత్త టెక్నాలజీ ఆధునిక ఎలక్ట్రానిక్ భాగాలతో అభివృద్ధి చెందుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలలో శిక్షణ పొందడం అవసరం. వినియోగదారుల భద్రత దృష్ట్యా అటువంటి సంఘటనలు జరగకుండా అధీకృత టాటా మోటార్స్ వర్క్ షాప్ లలో మాత్రమే తమ వాహనాలకు, యాక్సెసరీస్, స్పేర్ పార్ట్ లను మార్చుకోవాలని వినియోగదారులను కోరుతున్నామని విజ్ఞప్తి చేసింది. అయితే ఇలాంటి ఘటన 2022 జూన్ లో కూడా చోటు చేసుకుంది. ముంబైలోనే రెస్టారెంట్ వెలుపల నిలిపి ఉంచిన టాటా నెక్సన్ కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి.