Business Ideas : ఒక్కసారి పెట్టుబడి.. నెలకు 70 వేల సంపాదన…ఎకరం పొలం ఉంటే చాలు..

Business Ideas : ఒక ఎకరం పొలం ఉంటే చాలు ఒక్కసారి పెట్టుబడితో లాభాలను పొందవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా…అవును అరటి సాగుతో ఇది సాధ్యమే..చాలామంది రైతులకు మంచి లాభాలను తెచ్చిపెట్టే పంట అరటి సాగు. ఒకసారి నాటిన అరటి మొక్క దాదాపుగా 5 సంవత్సరాల వరకు కాపును అందిస్తుంది. మన దేశంలోని చాలా ప్రాంతాలలో అరటి సాగు చేస్తున్నారు. అంతేకాక అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందే పంటలలో అరటి సాగు ఒకటి. దీంతో […]

  • Published On:
Business Ideas : ఒక్కసారి పెట్టుబడి.. నెలకు 70 వేల సంపాదన…ఎకరం పొలం ఉంటే చాలు..

Business Ideas : ఒక ఎకరం పొలం ఉంటే చాలు ఒక్కసారి పెట్టుబడితో లాభాలను పొందవచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా…అవును అరటి సాగుతో ఇది సాధ్యమే..చాలామంది రైతులకు మంచి లాభాలను తెచ్చిపెట్టే పంట అరటి సాగు. ఒకసారి నాటిన అరటి మొక్క దాదాపుగా 5 సంవత్సరాల వరకు కాపును అందిస్తుంది. మన దేశంలోని చాలా ప్రాంతాలలో అరటి సాగు చేస్తున్నారు. అంతేకాక అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందే పంటలలో అరటి సాగు ఒకటి. దీంతో ప్రస్తుతం రైతులు అరటి సాగు చేసేందుకు మెగ్గు చూపిస్తున్నారు. అయితే అరటి సాగుకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఉత్తమంగా భావిస్తారు. అంటే అధిక వర్షపాతం గల ప్రాంతాలు అరటి సాగుకు పనికిరావని చెప్పాలి.

one-time-investment-earning-70-thousand-per-month-one-acre-farm-is-enough

అలాగే అరటి సాగుకు లోవర్ లోమ్ మరియు క్లే లోమ్ లో అనే నెలలు చాలా ఉత్తమమైనవి. అయితే ఒక్క ఎకరంలో అరటి సాగు చేసేందుకు దాదాపుగా రూ.70 నుండి రూ.80 వేల వరకు ఖర్చు అవుతుందట. ఒకే ఒక్కసారి పెట్టుబడితో సుమారు 3.5 నుండి 4 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఇతర పంటలతో పోల్చి చూస్తే అరటి సాగు విధానం చాలా సులభం. అరటి పంటను పండించేందుకు రసాయనాలకు బదులుగా సేంద్రియ ఎరువులను వాడడం వలన మరికొంత ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే సేంద్రియ ఎరువులను వాడడం వలన పంట దిగుబడి బాగుంటుంది. అయితే అరటి పండిన తర్వాత మిగిలిన వ్యర్ధాలను బయట వేయకుండా పొలంలోనే అలా వదిలేయడం వలన సహజమైన ఎరువుగా మారుతాయి.

one-time-investment-earning-70-thousand-per-month-one-acre-farm-is-enough

అయితే ప్రస్తుతం సింగపూర్లో ఎక్కువగా పండించేే Robusta రకం అరటి పండ్లను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ రకం అరటి సాగులో అరటి ఉత్పత్తి అధికంగా లభిస్తుంది. ఇక దీనితోపాటు వామన్ , సల్బోగ్, అల్పాగ్, పువాన్ వంటి రకాలు కూడా మంచి అరటి ఉత్పత్తులు. అలాగే అరటి సాగులో పండ్లతో పాటు ఆకులను అమ్మడం వలన మరి కొంత లాభాలను పొందవచ్చు. ప్రస్తుత కాలంలో కొన్ని రెస్టారెంట్స్ లో ప్లేట్లకు బదులుగా అరిటాకులను ఉపయోగిస్తున్నారు. ఇలా తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలను అరటి సాగు ద్వారా పొందవచ్చు. అయితే కొత్తగా అరటి సాగును ప్రారంభించాలి అనుకునేవారు కచ్చితంగా అనుభవం గల రైతులను అడిగి తెలుసుకోవడం మంచిది.