Business Idea : రెండు లక్షల పెట్టుబడితో నెలకు లక్ష ఆదాయం..ఎప్పటికీ డిమాండ్ తగ్గని బిజినెస్..

Business Idea  : ఈరోజుల్లో చాలామంది వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అలాంటి వారి కోసమే మేము ఒక బిజినెస్ ప్లాన్ ను తీసుకొచ్చాం..అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందగలిగే బిజినెస్ ఇది. అదే ప్లే యాష్ బ్రిక్స్ వ్యాపారం. అయితే ప్రస్తుతం బూడిదతో తయారు చేయబడిన ఇటుకలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక రాబోయే కాలంలో దీనికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం […]

  • Published On:
Business Idea : రెండు లక్షల పెట్టుబడితో నెలకు లక్ష ఆదాయం..ఎప్పటికీ డిమాండ్ తగ్గని బిజినెస్..

Business Idea  : ఈరోజుల్లో చాలామంది వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చాలామంది ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అలాంటి వారి కోసమే మేము ఒక బిజినెస్ ప్లాన్ ను తీసుకొచ్చాం..అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందగలిగే బిజినెస్ ఇది. అదే ప్లే యాష్ బ్రిక్స్ వ్యాపారం. అయితే ప్రస్తుతం బూడిదతో తయారు చేయబడిన ఇటుకలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక రాబోయే కాలంలో దీనికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శరవేగంగా పూర్తి చేస్తున్న పట్టణీకరణ యుగంలో బిల్డర్స్ బూడిదతో తో చేసిన ఇటుకలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే దీనికోసం 100 గజాలు స్థలంతో పాటు రెండు లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

income-of-one-lakh-per-month-with-an-investment-of-two-lakhs-a-business-whose-demand-will-never-decrease

ఇక ఈ వ్యాపారం ద్వారా ప్రతినెల కనీసం లక్ష రూపాయలు సంపాదించవచ్చునట..అయితే ఈటికల తయారీ విధానం మరియు కావాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటుకలను పవర్ ప్లాంట్ లో లభించే బూడిద సిమెంట్ మరియు రాతి దూళి మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇటుకల తయారీకి ఉపయోగించే మ్యానువల్ యంత్రాన్ని 100 గజాల స్థలంలో అమర్చుకోవాలి. ఇక ఈ యంత్రాన్ని ఉపయోగించడానికి 5 నుండి 6 మంది వ్యక్తులు అవసరమవుతారు. ఈ మిషన్ ద్వారా రోజుకు దాదాపుగా 3000 ఇటుకలు తయారు చేయవచ్చు. పెట్టుబడి ఎక్కువ పెట్టగలిగే వారైతే ఆటోమేటిక్ మిషన్ ను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

income-of-one-lakh-per-month-with-an-investment-of-two-lakhs-a-business-whose-demand-will-never-decrease

ఆటోమేటిక్ మిషన్ ధర 10 నుండి 12 లక్షలు లోపు ఉంటుంది. అయితే ఆటోమేటిక్ మిషన్ లో ముడిసరుకు కలపడం నుండి ఇటుకల తయారీ వరకు మొత్తం యంత్రం లోనే జరిగిపోతాయి. ఎలాంటి పనివారు అవసరం ఉండదు. ఇక ఆటోమేటిక్ యంత్రం గంటకు 1000 ఇటుకలను తయారు చేస్తుంది. దీని ద్వారా నెలలో మీరు మూడు నుండి నాలుగు లక్షల ఇటుకలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో మట్టి లేని కారణంగా అక్కడ ఇటుకల తయారీ సాధ్యం కాదు. తద్వారా ఇటుకలకు అక్కడ చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ నుండి ఇటుకలను ఎగుమతి చేస్తే మరిన్ని లాభాలని ఆర్జించవచ్చు.