Solar Stove : గ్యాస్ సిలిండర్ లేకుండా పనిచేసే స్టవ్..ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు..అదేంటంటే..?

Solar Stove  : ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువుపై భారీగా రేట్లు పెరిగాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర ప్రాంతంల తో ,సహా గ్యాస్ ధరలు దాదాపుగా రూ.1150 పైనే ఉన్నాయి. దీనికి డెలివరీ చార్జీలు కలుపుకుంటే మన ఇంటికి సిలిండర్ వచ్చేలోపు 1200 అవుతుంది. అయితే ఇది మధ్య తరగతి కుటుంబానికి చాలా ఎక్కువ అని చెప్పాలి.ఇలా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో ఇబ్బంది పడే వారికి ఒక అదిరిపోయే న్యూస్ అందుబాటులోకి […]

  • Published On:
Solar Stove : గ్యాస్ సిలిండర్ లేకుండా పనిచేసే స్టవ్..ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు..అదేంటంటే..?

Solar Stove  : ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువుపై భారీగా రేట్లు పెరిగాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర ప్రాంతంల తో ,సహా గ్యాస్ ధరలు దాదాపుగా రూ.1150 పైనే ఉన్నాయి. దీనికి డెలివరీ చార్జీలు కలుపుకుంటే మన ఇంటికి సిలిండర్ వచ్చేలోపు 1200 అవుతుంది. అయితే ఇది మధ్య తరగతి కుటుంబానికి చాలా ఎక్కువ అని చెప్పాలి.ఇలా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో ఇబ్బంది పడే వారికి ఒక అదిరిపోయే న్యూస్ అందుబాటులోకి వచ్చింది. గ్యాస్ సిలిండర్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే వంట చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా. అయితే ఒకసారి ఈ సోలార్ కుకింగ్ స్టవ్ పై ఒక లుక్ వేయండి.

సూర్య నూటన్ సోలార్ స్టవ్ కొత్తగా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. ఈ సోలార్ స్టవ్ ద్వారా ఒకటి రెండుసార్లు ఈజీగా వంట చేసుకోవచ్చు. ఈ స్టవ్ ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు రూపొందించారు. ఇక ఈ సోలార్ స్టవ్ రీఛార్జిబుల్ ఇండోర్ సోలార్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో రెండు యూనిట్లు ఉంటాయి. ఒకటేమో స్టవ్ దీన్ని ఇంట్లో కిచెన్ లో ఏర్పాటు చేసుకోవాలి. మరొకటి ఇంటి పైకప్పు పైన ఉండే సోలార్ ప్యానల్. అయితే ఈ సోలార్ స్టవ్ ను ఉపయోగించి దాదాపుగా నలుగురికి వంట చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటుంది. ఉదయం మరియు రాత్రి రెండుసార్లు వంట చేసుకోవచ్చు.

a-stove-that-works-without-a-gas-cylinder-you-can-cook-without-spending-a-single-rupee

a-stove-that-works-without-a-gas-cylinder-you-can-cook-without-spending-a-single-rupee

 

స్టవ్ అనేది ఇంటి పైన ఉన్న సోలార్ ప్యానల్స్ తో ఒక కేబుల్ ద్వారా కనెక్ట్ చేయబడుతుంది. ఆ సోలార్ ప్యానల్స్ లో నుండి వచ్చే సోలార్ ఎనర్జీ ద్వారా స్టవ్ పనిచేస్తుంది. అయితే సోలార్ ప్యానల్ సోలార్ ఎనర్జీని థర్మల్ బ్యాటరీ రూపంలో స్టోర్ చేసుకుంటుంది.దీనివలన మీరు రాత్రిపూట కూడా వంట చేసుకుని అవకాశం లభిస్తుంది. అంతేకాక ఈ సోలార్ స్టప్ ఎలక్ట్రిసిటీ ద్వారా కూడా పనిచేస్తుందని కంపెనీ తెలియజేసింది. అంటే దీన్ని హైబ్రిడ్ స్టవ్ అని పిలవచ్చు. అయితే ప్రస్తుతం ఈ స్టవ్ 3 వేరియంట్లో లభిస్తుంది.ప్రీమియం మోడల్ అయితే ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా మూడు పూటల వంట చేసుకోవచ్చు. ఈ సోలార్ స్టవ్ దాదాపుగా10 సంవత్సరాల దాకా మన్నిక నిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక సోలార్ ప్యానల్ అయితే 25 సంవత్సరాల వరకు పనిచేస్తుందట.

అయితే ప్రభుత్వం ఇప్పటికే ఈ సోలార్ కుకింగ్ స్టవ్ ను పరీక్షించింది. చలికాలం వానాకాలం ఎండాకాలం ఎలా పనిచేస్తాయో పరిశీలించారు. లేహ్ వంటి మంచు ప్రాంతాల్లో కూడా ఈ స్టవ్ ను ఉపయోగించి వంట చేయడం జరిగిందట. అంతేకాక ఢిల్లీలోని ఉదయపూర్ , గ్వాలియర్ వంటి ప్రాంతాల్లో ఈ స్టవ్ ను ఉపయోగించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.ఈ సోలార్ స్టప్ యొక్క ధర విషయానికి వస్తే బేస్ మోడల్ అయితే 12000 గా, టాప్ మోడల్ అయితే 23000గా ఉంది. అయితే రాబోయే కాలంలో దీని ధర మరింత తగ్గవచ్చు అని ఇండియన్ ఆయిల్ పేర్కొంద.