Yawar With Nayani Pavani : శివాజీ బిడ్డతో యావర్ తమ్ముడు అనుకుంటే అల్లుడు అవుతుండుగా…

Yawar With Nayani Pavani  ; బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే ఈ సీజన్ ప్రేక్షకులను అంతగా అలరించింది. మరి ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. వీరిలో స్టైల్ బ్యాచ్ గా ఏర్పడిన శివాజీ , పల్లవి ప్రశాంత్ ,యావర్ లు ఒక టీం గా బాగా ఆకట్టుకున్నారు.ఇక ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ కి పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. సీరియల్ బ్యాచ్ అయిన […]

  • Published On:
Yawar With Nayani Pavani : శివాజీ బిడ్డతో యావర్ తమ్ముడు అనుకుంటే అల్లుడు అవుతుండుగా…

Yawar With Nayani Pavani  ; బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే ఈ సీజన్ ప్రేక్షకులను అంతగా అలరించింది. మరి ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. వీరిలో స్టైల్ బ్యాచ్ గా ఏర్పడిన శివాజీ , పల్లవి ప్రశాంత్ ,యావర్ లు ఒక టీం గా బాగా ఆకట్టుకున్నారు.ఇక ఈ ముగ్గురు ఫ్రెండ్షిప్ కి పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. సీరియల్ బ్యాచ్ అయిన అమర్ దీప్ ,ప్రియాంక , గౌతమ్ , అర్జున్ ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక వీరందరినీ వెనక్కి నెట్టిన పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకొని చివరిగా విన్నర్ అయి చూపించాడు. అయితే ప్రశాంత్ యావర్ కి మొదట నుండి అండగా నిలిచాడు. ఇక శివాజీ హౌస్ లో ఉన్న అందరికి అండగా నిలిచాడు. శివాజీ ఇంటికి ఒక పెద్దవాడిగా వ్యవహరించాడు.

yavar-with-nayani-pawani-viral-photos

మరి ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విజయంలో కీలకంగా అయ్యాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో శివాజీని పల్లవి ప్రశాంత్ యావర్ లు అన్నా అంటూ పిలుచుకునేవారు.అయితే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చిన కూడా అంతా బాగా కలిసి ఉంటున్నారు అని చెప్పాలి. కాని ఇప్పుడు ప్రిన్స్ యావర్ శివాజీకి దెబ్బ వేశాడు అని పలువురు అంటున్నారు. ఎందుకంటే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ధ్వారా వచ్చిన నైనీ పావని కూడా శివాజీకి బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి.ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు శివాజీని తండ్రిగా భావించింది. శివాజీ కూడా ఆమెని బిడ్డ అని పిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఉన్నది ఒక్క వారమే అయిన శివాజీతో ఆమెకు మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు హౌస్ నుండి అందరూ బయటకు వచ్చిన తర్వాత నైనీ పావని ఎక్కువగా ప్రిన్స్ యావర్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తుంది.

yavar-with-nayani-pawani-viral-photos

వీరిద్దరూ కలిసి ఈ మధ్య బాగా రీల్స్ చేస్తున్నారు. చాలా రొమాంటిక్ గా వీరిద్దరూ రెచ్చిపోతున్నారు.తాజాగా వీరిద్దరూ కలిసి తెలియదే అనే ఒక ప్రైవేట్ సాంగ్ చేశారు. ఇది యూట్యూబ్ లో విడుదలైంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ప్రమోషన్ లను కూడా భారీగానే చేస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా వీరిద్దరూ ఒక రొమాంటిక్ ఫోటో షూటింగ్ చేశారు. ఇక దీనిలో ప్రిన్స్ యావర్ ఎద పై వాలిపోతున్నట్లు నయిని పావని ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఆ ఫోటోలో చూసిన వారందరూ ఇప్పుడు షాక్ అవుతున్నారు. వీళ్ళు ఏంటి ఇలా రెచ్చిపోతున్నారని , ప్రిన్స్ యావర్ శివాజీ కి వెన్నుపోటు పొడిచాడని కామెంట్ లు పెడుతున్నారు. వీళ్ళని శివాజీ చజస్తే ఇన్ని రోజులు తమ్ముడు అనుకుంటే ఇప్పుడు అల్లుడు అయ్యావ్ ఏంట్రా అంటాడేమో అని కొంతమంది కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.