Bigg Boss Buzz : ఆ పిల్లాడు చాలా డేంజర్….పల్లవి ప్రశాంత్ పై దామిని సంచలన కామెంట్స్….

Bigg Boss Buzz  : బిగ్ బాస్ సీజన్ 7 అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారంలో మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక ఇప్పుడు మూడోవారం ఎవరు ఊహించని విధంగా సింగర్ దామిని బయటకు వచ్చింది. బిగ్ […]

  • Published On:
Bigg Boss Buzz : ఆ పిల్లాడు చాలా డేంజర్….పల్లవి ప్రశాంత్ పై దామిని సంచలన కామెంట్స్….

Bigg Boss Buzz  : బిగ్ బాస్ సీజన్ 7 అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. అయితే బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారంలో మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండవ వారంలో షకీలా ఎలిమినేట్ అయింది. ఇక ఇప్పుడు మూడోవారం ఎవరు ఊహించని విధంగా సింగర్ దామిని బయటకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండే చాలా యాక్టివ్ గా ఉంటూ లోపల ఉన్న వారికి వండి పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్న దామిని కొన్ని టాస్క్ లలో సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిందని విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెకు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఓట్లు వేయలేదు. నామినేషన్ లో ఉన్న దామిని కి అతి తక్కువ ఓటింగ్ జరగడంతో మూడవ వారం ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన దామిని లోపల ఉన్న కంటెస్టెంట్స్ కు కొన్ని సలహాలు ఇచ్చింది.

damini-comments-on-pallavi-prasanth-in-bigg-boss-buzz

హోస్ట్ నాగ్ చెప్పినట్లుగా హౌస్ లో ఉన్న వారి ఫోటోలకు ఉన్న బెలూన్స్ పగలకొట్టి ఒక్కొక్కరికి సలహాలు ఇచ్చింది. ఈ క్రమంలో శివాజీకి దామినికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న దానిని సంచలన విషయాలను తెలియజేసింది. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయి హొస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకు వచ్చిన దామిని హౌస్ లో ఉన్న వారిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో దామిని చేతికి గీతూ బొమ్మలు ఇచ్చి ఒక్కొక్కరి గురించి చెప్పమని అడిగింది. దీంతో హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి గురించి చెప్తూ వచ్చింది దామిని. ఇక దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ ప్రోమోలో ఏముందంటే… ముందుగా రతిక గురించి మాట్లాడిన దామిని ఆమె అన్ని సగం సగం వింటుందని చెప్పుకొచ్చింది.

damini-comments-on-pallavi-prasanth-in-bigg-boss-buzz

యావర్ ను ఉద్దేశించి గేమ్ ని అర్థం చేసుకోవాలని, శుభశ్రీ గురించి మాట్లాడుతూ బార్బీ డాల్ లాగా తయారవ్వడం మానేసి అప్పుడప్పుడు పని చేయమని చెప్పింది. తేజాను వెటకారం తగ్గించుకోమని పని దొంగ అని చెప్పింది. అనంతరం శోభాశెట్టి గురించి మాట్లాడుతూ తేజను అన్ని పనులు చేయవద్దని చెప్పు అంది. అలాగే గౌతమ్ గురించి మాట్లాడుతూ అన్ని నీకే తెలిసినట్లు మాట్లాడకు అని చెప్పింది. ఇక ప్రశాంత్ పేరు చెప్పగానే బొమ్మను పక్కన పెట్టేయండి అతని గురించి నేను మాట్లాడను అని చెప్పుకొచ్చింది. ఇక శివాజీ గురించి మాట్లాడుతూ ఆయన చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది. ఇలా బిగ్ బాస్ బజ్ ప్రోమో ముగిసింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి దామిని బయటకు రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే దామిని దాదాపు చివరి వరకు ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకు రావడం నిజంగా చాలామందికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది అని చెప్పాలి.