Amar Deep : వాడు అరెస్టు అయితే అది నా తప్ప….?

Amar Deep : ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పనవసరం లేదు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి విజేత కాగా సీరియల్ నటుడు అమర్దీప్ రన్నర్ అప్ గా నిలిచాడు. అయితే వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. గ్రాండ్ ఫైనలే లో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠత చివరి వరకు నిలిచింది. ఇద్దరికీ పోటాపోటీగా […]

  • Published On:
Amar Deep : వాడు అరెస్టు అయితే అది నా తప్ప….?

Amar Deep : ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పనవసరం లేదు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచి విజేత కాగా సీరియల్ నటుడు అమర్దీప్ రన్నర్ అప్ గా నిలిచాడు. అయితే వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. గ్రాండ్ ఫైనలే లో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠత చివరి వరకు నిలిచింది. ఇద్దరికీ పోటాపోటీగా ఓటింగ్స్ రాగా స్వల్ప తేడాతో పల్లవి ప్రశాంత్ విజేత అయ్యాడు. అయితే హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ అమర్ దీప్ మధ్య జరిగిన గొడవలు గురించి తెలిసిందే. మొదటి వారంలోనే నువ్వా నేనా అంటూ మాటల యుద్ధం జరిగింది.ఇక దీనితో బయట ప్రశాంత్ కు పాజిటివ్ అమర్ కి నెగిటివ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాత వారంలో వీరిద్దరూ అన్న తమ్ముడు లాగా కలిసిపోయారు. మరోసారి చివరి వారంలో వీరిద్దరి మధ్య గొడవలు మొదలు అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో అమర్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ మొదలయింది.

ఒకరి గురించి ఒకరు నెగిటివ్ కామెంట్స్ చేసుకున్నారు. ఇది అంతా పక్కన పెడితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద అమరదీప్ కారు పై ప్రశాంత్ ఫాన్స్ అంటూ కొంతమంది అల్లరి ముఖలు దాడి చేశాయి. ఆ సమయంలో కార్ లో అమర్ దీప్ తో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ కాంటెస్టెంట్లు కార్ల పై కూడా దాడి జరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను రోడ్ మీద ఉన్న కార్లను కూడా ధ్వంసం చేశారు. పోలీసులు హెచ్చరించిన పట్టించుకోకుండా ర్యాలీ చేయడంతో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం రెండు రోజుల తర్వాత బెల్ పై విడుదలయ్యాడు ప్రశాంత్. ఇక ఆ సమయంలో శివాజీ, బోలె, సుబశ్రీ, అశ్విని, రతిక, ప్రశాంత్ కి మద్దతు పలికారు. ఇక ప్రశాంత్ అరెస్ట్ పై మొదటిసారి స్పందించాడు అమర్ దీప్.  ఈ క్రమంలోనే అమర్ దీప్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వేరే మైండ్ సెట్ లో ఉంటాం బయటికి వచ్చినాక మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రతి మనిషి జీవితంలోని ఏదో ఒకటి ఊహించనిది జరుగుతుంది.

నాకు అలానే జరిగిందని అనుకున్నాను. విన్నర్ కాలేకపోయాననె బాధ లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నర్ అయ్యాను. రవితేజ గారు నాకు సినిమా ఛాన్స్ ఇచ్చినప్పుడే నేను విన్నర్ అయిపోయాను. అది చాలు నాకు నేను అందుకోసమే వచ్చాను నా అభిమానులు నన్ను అక్కడివరకు తీసుకువచ్చారు. ఒకప్పుడు అమర్ దీప్ చిన్న నటుడు ఇప్పుడు నన్ను పెద్ద సెలబ్రిటీ చేశారు. నాకు కావాల్సిన స్థానం వచ్చేసింది అన్నారు. ప్రశాంత్ అరెస్టు అయ్యారు అంటే కొన్ని మిస్ అండర్స్టాండ్స్ వలన అలా జరిగి ఉండవచ్చు. ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయాయి. ఇక బయట ఫ్యాన్స్ గొడవలు సహజం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు కూడా మా హీరో అంటే మా హీరో అని కొట్టుకునే వాళ్ళం ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. నేను చెప్పేది ఏమిటంటే మేము బాగానే ఉంటాం .మీరు బాగా ఉండండి త్వరలో రవితేజ సినిమా అప్డేట్ తో మీ ముందు . బిగ్ బాస్ తో నా లైఫ్ చాలా మారిపోయింది అనుకోను కానీ మెచ్యూరిటీ వచ్చింది. హౌస్ లో నేను వీక్ అన్నారు. కానీ నేను స్ట్రాంగ్ అని చెప్పుకొచ్చారు.