Y. S. Sharmila : ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల…సెటైర్లు వేస్తున్న వైసీపీ నాయకులు…

Y. S. Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం వైయస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలలో ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిల పని చేస్తానని ,అదేవిధంగా తన సొంత అన్నయ్య వైయస్ జగన్ తో పోటీ పడుతున్నారనే విషయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమించడంపై […]

  • Published On:
Y. S. Sharmila : ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల…సెటైర్లు వేస్తున్న వైసీపీ నాయకులు…

Y. S. Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం వైయస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలలో ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిల పని చేస్తానని ,అదేవిధంగా తన సొంత అన్నయ్య వైయస్ జగన్ తో పోటీ పడుతున్నారనే విషయం తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమించడంపై వైసీపీ నేతలు సైతం పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా వేశారు.

YS Sharmila as AP Congress President: Minister Ambati Rambabu made a shocking satire!!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియమించిన క్రమంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా అంబటి రాంబాబు వైయస్ఆర్ తో పాటే ఏపీ కాంగ్రెస్ కూడా కీర్తిశేషులు అయ్యిందనే సెన్స్ లో ట్విట్ చేశారు. తన ట్విట్టర్ వేదికగా డాక్టర్ వైయస్సార్ , ఏపీ కాంగ్రెస్ కి..శే..లే అని రాసుకొచ్చారు. అంటే డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి లేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కూడా లేదని అర్థం వచ్చేలా అంబటి రాంబాబు ట్వీట్ చేసినట్లుగా తెుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు అధ్యక్షురాలిగా ఎవరిని నియమిస్తే ఏంటి అనే భావం వచ్చేలా ఆయన ట్విట్ పేర్కొన్నారు.

ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడం నిజంగా వైసిపికి షాక్ అని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల బరిలోకి దిగితే ,వైసీపీ పార్టీలో అసంతృప్తులుగా ఉన్న చాలా మంది ఆమె వైపు అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ సాగుతుంది.మరి షర్మిల ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తుందో వేచి చూడాలి.