Viral News : బైక్ సీట్ కింద నుండి వినిపిస్తున్న శబ్దాలు…….ఏంటా అని సీట్ తీసి చూడగా….వామ్మో…

Viral News : సహాజంగా పాములనేవి పొలాల్లో లేదా పుట్టలో నివాసం ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు జననివాసాలలోకి వచ్చి సంచరిస్తుంటాయి. ఎండాకాలం అయితే ,అడవుల్లో ఉండే చెరువులు, కుంటలు ఎండిపోయి , నీళ్లు దొరకని పరిస్థితుల్లో జంతువులు మరియు విష సర్పాలు జననివాసాల్లోకి వస్తున్నాయి. అయితే ఇలాంటిదే ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎండ వేడిని తట్టుకోలేని ఓ పాము బైక్ లోకి దూరింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని నూజివీడులో […]

  • Published On:
Viral News : బైక్ సీట్ కింద నుండి వినిపిస్తున్న శబ్దాలు…….ఏంటా అని సీట్ తీసి చూడగా….వామ్మో…

Viral News : సహాజంగా పాములనేవి పొలాల్లో లేదా పుట్టలో నివాసం ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు జననివాసాలలోకి వచ్చి సంచరిస్తుంటాయి. ఎండాకాలం అయితే ,అడవుల్లో ఉండే చెరువులు, కుంటలు ఎండిపోయి , నీళ్లు దొరకని పరిస్థితుల్లో జంతువులు మరియు విష సర్పాలు జననివాసాల్లోకి వస్తున్నాయి. అయితే ఇలాంటిదే ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎండ వేడిని తట్టుకోలేని ఓ పాము బైక్ లోకి దూరింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని నూజివీడులో చోటుచేసుకుంది. అయితే పార్క్ చేసి ఉన్న బండిని స్టార్ట్ చేసుకుని ఓ వ్యక్తి పనిమీద బయటకు వెళ్తుండగా మార్గమధ్యలో తన కాలికి ఏదో చుట్టుకున్నట్లు అనిపించింది.

two-snakes-crawled-into-a-bike

ఏంటా అని కాలువైపు చూడగా పామును చూసి ఒక్కసారిగా హడలిపోయాడు. వెంటనే భయంతో బండిని నడిరోడ్డుపై వదిలేసి దూరంగా పారిపోయాడు. సతీష్ అనే వ్యక్తి ఓ మెకానిక్ షెడ్ వద్ద తన బండిని పార్క్ చేసి ఉంచాడు. కొద్దిసేపు అక్కడే ఉండి పని ముగించుకున్న సతీష్ తన బైక్ ను తీసుకుని వెళుతుండగా ఓ పాము బైక్ లో నుండి వచ్చే సతీష్ కాళ్లకు చుట్టుకుంది. ఇది గమనించిన సతీష్ వెంటనే బైక్ను నడిరోడ్డుపై వదిలేసి అక్కడి నుండి పరుగులు తీశాడు. కొద్దిసేపటికి ఆ పాము కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది. పాము వెళ్ళిపోయింది కదా…ఇక వెళ్ళిపోదామని ఉద్దేశంతో సతీష్ తన బైక్ వద్దకు రాగా బైక్ లో నుంచి బుస్సలు కొడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.

two-snakes-crawled-into-a-bike

ఆ శబ్దాన్ని గమనించిన సతీష్ ఇంకో పాము ఉందా ఏంటి అని పరిశీలించగా… బైక్ సీట్ కింద మరోపాముు కనిపించింది. దీంతో బెంబేలెత్తిపోయిన సతీష్ బైక్ ను వదిలి మళ్లీ పరుగు తీశాడు. దీనిని గమనించిన స్థానికులు చాకచక్యంగా సీట్ కింద ఉన్న పామును బయటకు తీశారు. అనంతరం కర్రలతో దాన్ని కొట్టి చంపేశారు. దీంతో ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వార్త తెలుసుకున్న నేటి జనులు బైక్ విషయంలో కూడా ఎప్పటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు . పొలం పరిసర ప్రాంతాలలో నివసించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు.

two-snakes-crawled-into-a-bike