Pani Puri : చిన్నారుల ప్రాణం తీసిన పానీపూరి…

Pani Puri : ప్రస్తుత కాలంలో చాలామంది రోడ్ సైడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్ కు బాగా అలవాటు పడుతున్నారు. మరియు ముఖ్యంగా రోడ్డు పక్కన దొరికే పానీ పూరికి ప్రజలలో మంచి ఆదరణ ఉంది. ఇక ఈ పానీ పూరిని చిన్నపిల్లల నుండి పెద్దలల వరకు ఎంతో ఇష్టంగా తీసుకుంటున్నారు. అయితే పానీపూరిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు కూడా చెబుతూనే ఉన్నారు.అయినప్పటికీ చాలామంది వీటిని విపరీతంగా తీసుకుంటూ ఉంటారు. ఇక మరికొన్ని […]

  • Published On:
Pani Puri : చిన్నారుల ప్రాణం తీసిన పానీపూరి…

Pani Puri : ప్రస్తుత కాలంలో చాలామంది రోడ్ సైడ్ దొరికే ఫాస్ట్ ఫుడ్ కు బాగా అలవాటు పడుతున్నారు. మరియు ముఖ్యంగా రోడ్డు పక్కన దొరికే పానీ పూరికి ప్రజలలో మంచి ఆదరణ ఉంది. ఇక ఈ పానీ పూరిని చిన్నపిల్లల నుండి పెద్దలల వరకు ఎంతో ఇష్టంగా తీసుకుంటున్నారు. అయితే పానీపూరిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు కూడా చెబుతూనే ఉన్నారు.అయినప్పటికీ చాలామంది వీటిని విపరీతంగా తీసుకుంటూ ఉంటారు. ఇక మరికొన్ని సందర్భాలలో రోడ్డు పక్కన దొరికే ఆహార పదార్థాలు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు అనారోగ్య భారిన పడక తప్పదు. అలాకాకుండా ప్రాణాలకే ముప్పు వస్తే ఏంటి పరిస్థితి…?అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది..పూర్తి వివరాల్లోకి వెళ్తే..

you-may-never-try-to-eat-pani-puri-after-watching-this

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో బుధవారం రాత్రి విషాదం జరిగింది. పానీ పూరి తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థకు గురై ప్రాణాలను కోల్పోయారు. అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10) , వెలపాటి విజయ్ ( 6 ) రాత్రి పానీ పూరి తినగా గురువారం రాత్రి వారిద్దరు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. ఇక అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పానీపూరి తినడం వల్లే ఫుట్ పాయిజన్ జరిగి తమ బిడ్డలు చనిపోయారని తల్లిదండ్రులు కన్నీరు మునీరయ్యారు. నంద్యాల జిల్లా వైయస్ ఆర్ కాలనీ నుండి బతుకుతెరువు కోసం చిన్నారులతో కలిసి వీరు జంగారెడ్డిగూడెంకి వలస వచ్చారు. ఇక ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ వ్యాపారం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అయితే ఊహించని రీతిలో చిన్నారులు మృత్యువాత పడటంతో స్థానికంగా ఈ న్యూస్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.