Vizianagaram Train Accident : విశాఖలో ఘోర రైలు ప్రమాదం…పెరుగుతున్న మృతుల సంఖ్య…

Vizianagaram Train Accident  : ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి అలమండ మధ్య ఆదివారం రోజు రాత్రి సమయంలో 7:00 గంటలు కు ఈ రైలు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ట్రాక్ పై ఉన్న ఓ రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనలో మూడు భోగీలు నుజ్జు అయి 14 మంది దుర్మరణం చెందగా 33 మందికి గాయాలయ్యాయని […]

  • Published On:
Vizianagaram Train Accident : విశాఖలో ఘోర రైలు ప్రమాదం…పెరుగుతున్న మృతుల సంఖ్య…

Vizianagaram Train Accident  : ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి అలమండ మధ్య ఆదివారం రోజు రాత్రి సమయంలో 7:00 గంటలు కు ఈ రైలు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ట్రాక్ పై ఉన్న ఓ రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనలో మూడు భోగీలు నుజ్జు అయి 14 మంది దుర్మరణం చెందగా 33 మందికి గాయాలయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది. అంతేకాక క్షతగాత్రుల సంఖ్య దాదాపు 100కు పైగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా అర్థమవుతుంది.

train-accident-in-visakhapatnam

అయితే విశాఖపట్నం -పలాస రైలు ను అతి కొద్ది నిమిషాలు తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ రైలు ఢీకొట్టడం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో రాయగడ ట్రైన్ లో బోగీలు కొన్ని నుజ్జు అవ్వగా మరికొన్ని పట్టాలు తప్పయి. ఈ క్రమంలో అక్కడే మరో ట్రాక్ పైకి గూడ్స్ రైల్ బోగీలు దూసుకెళ్లాయి. ఇక ఈ ఘటన రాత్రివేళ చోటు చేసుకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి రైలు యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే రైలు ప్రయాణం ఎంతో సురక్షితం అని భావించే ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

train-accident-in-visakhapatnam

అయితే తాజాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రుల కుటుంబాలకు 50 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ద్వారా వివరాలు తెలుసుకున్న ప్రధాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కూడా మాట్లాడినట్లుు వివరించారు. అలాగే ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో ఇవాళ రైళ్ళను రద్దు చేసినట్లు వెల్లడించారు.