Nara Lokesh : ముగిసిన సిఐడి విచారణ…నారా లోకేష్ ను అడిగిన ప్రశ్నలు ఇవేనా…

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సిఐడి అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన విచారణ ఇటీవల ముగిసింది. రెండు రోజులపాటు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి విచారణ చేపట్టింది . ఈ నేపథ్యంలో మొదటి రోజు నారా లోకేష్ ను సిఐడి 30 ప్రశ్నలు అడగగా రెండవ […]

  • Published On:
Nara Lokesh : ముగిసిన సిఐడి విచారణ…నారా లోకేష్ ను అడిగిన ప్రశ్నలు ఇవేనా…

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు సిఐడి అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన విచారణ ఇటీవల ముగిసింది. రెండు రోజులపాటు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఉదయం 10:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి విచారణ చేపట్టింది . ఈ నేపథ్యంలో మొదటి రోజు నారా లోకేష్ ను సిఐడి 30 ప్రశ్నలు అడగగా రెండవ రోజు విచారణలో 47 ప్రశ్నలు అడిగారు. అయితే హెరిటేజ్ సంస్థకు సంబంధించి మరియు లోకేష్ మంత్రిగా వ్యవహరించినప్పుడు తీసుకున్న నిర్ణయాల గురించి ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేసి అధిక మొత్తంలో లాభాలను పొందినట్లుగా సిఐడి లోకేష్ పై అభియోగాలు మోపింది.

the-completed-cid-investigation-these-are-the-questions-asked-to-nara-lokesh

ఇక ఈ కేసులో 14వ నిందితుడుగా ఉన్న లొకేషన్ సిఐడి అధికారులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు హెరిటేజ్ భూముల కొనుగోలు పై ప్రశ్నించగా రెండవ రోజు డాక్యుమెంట్స్ గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వంలో 2017లో అమరావతి అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై కూడా లోకేష్ ను ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు ఈ కమిటీలోనే నిర్ణయం తీసుకున్నారా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ క్యాబినెట్ లో ఎవరెవరు ఉన్నారు…? లోకేష్ మంత్రి అయిన తర్వాత ఈ కమిటీలోకి ఎంతమందిని చేర్చారు..?లింగమనేని రమేష్ కు మీరు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు..?అనే ప్రశ్నలు లోకేష్ ను సిఐడి అధికారులు అడిగారు.

the-completed-cid-investigation-these-are-the-questions-asked-to-nara-lokesh

అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఖాతా నుండి లింగమనేని రమేష్ 27 లక్షలు ఎందుకు చెల్లించారని దానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.ఇలా మొదటి రోజు దాదాపు 6:30 గంటల పాటు నారా లోకేష్ ను విచారించిన సిఐడి , రెండవ రోజు కూడా దాదాపు 6 గంటల పాటు విచారించారు. ఇక ప్రస్తుతానికి విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. మరోసారి విచారణ జరిపితే సహకరించాల్సిందిగా సీఐడీ అధికారులు లోకేష్ కు తెలియజేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ ఎప్పుడు నోటీసులు ఇచ్చిన సహకరించెందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అనంతరం అక్కడనుండి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వెళ్లి లోకేష్ ఢిల్లీ వెళ్ళిపోయారు