Jagananna Arogya Suraksha : నేటి నుండి రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష…ఇంటింటికి సంపూర్ణ ఆరోగ్యం…

Jagananna Arogya Suraksha  : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో వైయస్సార్సీపి పార్టీ మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టడం జరిగింది. అయితే దీనిని ఈరోజు నుండి ప్రారంభించనున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో పేదలందరికీ కుటుంబ సంక్షేమం మరియు ఆరోగ్య భరోసా కల్పించే దిశగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి తొలి విడత కార్యక్రమాన్ని […]

  • Published On:
Jagananna Arogya Suraksha : నేటి నుండి రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష…ఇంటింటికి సంపూర్ణ ఆరోగ్యం…

Jagananna Arogya Suraksha  : ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో వైయస్సార్సీపి పార్టీ మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టడం జరిగింది. అయితే దీనిని ఈరోజు నుండి ప్రారంభించనున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో పేదలందరికీ కుటుంబ సంక్షేమం మరియు ఆరోగ్య భరోసా కల్పించే దిశగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి తొలి విడత కార్యక్రమాన్ని ఇదివరకే పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దాదాపు 50 రోజులపాటు కొనసాగడం జరిగింది. వార్డు మరియు గ్రామ వాలంటీర్లు , ఏఎన్ఎంలు రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల ఆరోగ్య అవసరాలను తెలుసుకొని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం గ్రామాలు మరియు వార్డుల కోసం హెల్త్ క్యాంపులను నిర్వహించారు. అదేవిధంగా పేదలందరికీ మెరుగైన వైద్య సేవలను అందించారు.

jagananna-arogya-suraksha-2nd-schegule

అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురైన వారిని ఆసుపత్రులకు సిఫారసు చేశారు. జగనన్న ఆరోగ్య సంక్షేమం తొలి విడత కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ పథకం ద్వారా దాదాపు 60 లక్షల మంది వారి ఇంటి వద్దనే నాణ్యమైన వైద్యాన్ని పొందగలిగారు. రోగులు ఆసుపత్రి వరకు వెళ్లకుండానే ఇంటి వద్ద సమగ్ర వైద్యాన్ని అందించే దిశగా జగన్ ప్రభుత్వం కసరత్తులు చేసింది. అయితే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష సంక్షేమ పథకం ప్రారంభించిన తర్వాత ఓపి పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గినట్లు వార్తలు కూడా వినిపించాయి. ప్రజల నుంచి కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.దీంతో రెండో విడత ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే నేటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాలలో వైద్య శిబిరాలు మొదలుకానున్నాయి.

jagananna-arogya-suraksha-2nd-schegule

రేపటినుండి పట్టణాలలో నగరాలలో కూడా ఈ వైద్య శిబిరాలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఆరు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఈ ఆరు నెలల్లో దాదాపు 13954 శిబిరాలను ప్రభుత్వం నిర్వహించనుంది. అలాగే ప్రతి వైద్య శిబిరం వద్ద 105 రకాల మందులు మరియు అనేక రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ప్రజల ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు మరియు ఏఎన్ఎం లు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి అన్ని సమాచారాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో , జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించే విధంగా ప్రణాళికలను రూపొందించారు. ఈ విధంగా జగనన్న రెండో విడత ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటు కానున్నాయి. అయితే ఇంటి వద్దనే మెరుగైన వైద్యం అందుకోవడం అంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రమే దక్కిన అదృష్టమని చెప్పారు.