Ap Ration Shops : రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం శుభవార్త…వచ్చే నెల నుండి…

Ap Ration Shops  : తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే నవంబర్ నుండి క్రమం తప్పకుండా లబ్ధిదారులకు కిలో చొప్పున కందిపప్పు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దాదాపు 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన […]

  • Published On:
Ap Ration Shops : రేషన్ కార్డు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం శుభవార్త…వచ్చే నెల నుండి…

Ap Ration Shops  : తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డులు ఉన్నవారికి కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే నవంబర్ నుండి క్రమం తప్పకుండా లబ్ధిదారులకు కిలో చొప్పున కందిపప్పు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దాదాపు 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన అగ్రికల్చరల్ కో- ,ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ ( హకా )కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అసోసియేషన్లో తగినంత నిలువలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

jagan-government-good-news-for-ration-card-holders-from-next-month

అయితే తొలి దశలో 3660 టన్నులు రెండవ దశలో 3540 టన్నులు అందించనునట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చే నెల అవసరాల నిమిత్తం 2300 టన్నుల కందిపప్పు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా చూసినట్లయితే పప్పు ధాన్యాల కొరత ఉండడంతో ధరలు భారీగా పెరిగాయి. అంతేకాక దేశవ్యాప్తంగా పలు ఉత్పత్తులు బహిరంగ మార్కెట్ కు వెళ్లిపోవడం వలన భారతదేశంలో నిలవలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం కందిపప్పు కొనుగోలుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుతం కిలో కందిపప్పు ధర మార్కెట్లో 150 నుంచి 180 మధ్య నడుస్తుంది.. కానీ జగన్ ప్రభుత్వం కేవలం రూ.67 కే కిలో కందిపప్పును రేషన్ కార్డు ఉన్నవారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

jagan-government-good-news-for-ration-card-holders-from-next-month

అంటే ఒక సబ్సిడీపై దాదాపు 70 కి పైగా ప్రభుత్వమే భరిస్తున్నట్లు లెక్క. అలాగే కేవలం నవంబర్ మాత్రమే కాకుండా డిసెంబర్ జనవరిలో కూడా కందిపప్పు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం 50వేల టన్నుల కందిపప్పును కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని బఫర్ స్టాక్ నుంచి 9,764టన్నులు కందులను కేటాయించగా వాటి లో నాణ్యత లేదు . దీంతో రెండుసార్లు ప్రతిపాదనలు పంపిన స్పందించకపోవడం గమనార్హం. దీంతో వచ్చే మూడు నెలలకు హకా నే రాష్ట్ర ప్రభుత్వానికి కందిపప్పు పంపిణీ చేయనుంది. ఇక వీటిని ప్రాసెస్ చేసి సబ్సిడీ ద్వారా కార్డు ఉన్నవారికి అందించనున్నారు. ఏపీ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి నెల నెల నిరంతరాయంగా కందీపంపు పంపిణి చేసేలా చర్యలు చేపడుతున్నారు.