Chandrababu Bail : చంద్రబాబుకు హైకోర్టు ఊరట… మధ్యంతర బెయిల్ మంజూరు…

Chandrababu Bail : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత 53 రోజులుగా జైల్లోనే ఉంటున్న చంద్రబాబుకు తాజాగా హైకోర్టు కాస్త ఊరట కల్పించింది. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బేయిల్ […]

  • Published On:
Chandrababu Bail : చంద్రబాబుకు హైకోర్టు ఊరట… మధ్యంతర బెయిల్ మంజూరు…

Chandrababu Bail : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో ఉంచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత 53 రోజులుగా జైల్లోనే ఉంటున్న చంద్రబాబుకు తాజాగా హైకోర్టు కాస్త ఊరట కల్పించింది. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బేయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం సుఖమత వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే దాదాపు నాలుగు వారాలపాటు చంద్రబాబుకు బేయిల్ మంజూరు చేసింది. అయితే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

high-court-granted-bail-to-chandrababu

చంద్రబాబుకు ప్రస్తుతం కంటి శస్త్ర చికిత్స చాలా అవసరమన్న వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్టు ఇటీవల చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో గత కొంతకాలంగా మధ్యంతర బెయిల్ విషయంలో వాదనలు వింటూ వస్తున్న హైకోర్టు ఇటీవల పూర్తి విచారణ అనంతరం నాలుగు వారాలకు బెయిల్ మంజూరు చేసి రెగ్యులర్ పెయిన్ విచారణ నవంబర్ 10వ తేదీన వాయిదా వేసింది.అయితే ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

high-court-granted-bail-to-chandrababu

ఇక అప్పటినుండి దీనికి సంబంధించి ఇరువు వర్గాల వాదనలు వింటూ వస్తున్న హైకోర్టు కొంతకాలం పాటు తీర్పు ను రిజర్వ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 53 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. అయితే తాజాగా చంద్రబాబు కుడి కంటికి చికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించడం మరియు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని హైకోర్టుకు తేలియజేయడంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం బేయిల్ మంజూరు చేసింది. ఇక చంద్రబాబుకు బేల్ రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిపి వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు.చంద్రబాబు అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.