Jagan : ఏపీ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

Jagan  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైయస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తన తండ్రి ఆశయాలను సాధించే దిశగా ప్రజా పాలన కొనసాగిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల మద్దతును పొందుతున్నారు. ముఖ్యంగా వైద్య, విద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం ఆయన వివిధ పథకాలను అమలు చేస్తూ వారికి భరోసాగా నిలుస్తున్నారు. ఇటీవల వైయస్ ఆర్ చేయూత, ఇబిసీ నేస్తం, వంటి […]

  • Published On:
Jagan : ఏపీ మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

Jagan  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైయస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తన తండ్రి ఆశయాలను సాధించే దిశగా ప్రజా పాలన కొనసాగిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల మద్దతును పొందుతున్నారు. ముఖ్యంగా వైద్య, విద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం ఆయన వివిధ పథకాలను అమలు చేస్తూ వారికి భరోసాగా నిలుస్తున్నారు. ఇటీవల వైయస్ ఆర్ చేయూత, ఇబిసీ నేస్తం, వంటి పథకాల ద్వారా మహిళలకు డబ్బులు ఎకౌంట్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఏపీ మహిళలకు వైయస్ ఆర్ ఇబీసీ నేస్తం ద్వారా అర్హులైన మహిళలకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కర్నూల్ జిల్లాలో ఈనెల 24వ తేదీన జరగబోయే కార్యక్రమంలో జగన్ దీనికి సంబంధించిన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల లో డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం . వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అగ్రవర్గాలకు చెందిన 45 నుంచి 65 లోపు మహిళలకు ఈ పథకం ద్వారా 15000 రూపాయలు అకౌంట్ లో జమ ఐతున్న విషయం అందరికీ తెలిసిందే. 45 నుంచి 60 ఏళ్ల వయసుకు మహిళలు ఈ పథకానికి అర్హులు. అయితే ఈ పథకానికి అర్హులైన వారికి కుటుంబా ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10 వేల రూపాయల ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల ఆదాయం మాత్రమే ఉండాలి. కుటుంబానికి మొత్తం మూడు ఎకరాలు ఛిత్తడిని ఎలా లేదా పొడి భూమి కానీ తడి భూమి కానీ ఉండాలి. అయితే ఈ పథకానికి కావలసిన అర్హత డాక్యుమెంట్స్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం…

అయితే ఈ పథకానికి అర్హులైన వారు కుటుంబానికి ఫోర్ వీలర్ అంటే ఆటో టాక్సీ ఇతర వాహనాలు ఉండకూడదు.
కుటుంబ సభ్యులు ఇన్కమ్ టాక్స్ కట్టకూడదు. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీ లో 700 చదరపు భూములు కన్నా ఎక్కువ భూమి ఉండకూడదు. ఏపీ సేవ ద్వారా తీసుకున్న కుల ధ్రువీకరణ అందజేయాలి. వయసు ధ్రువీకరణ అంటే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లేదా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ టెన్త్ మెమో వాటి మిమ్ములతో పాటు ఓటర్ ఐడి జత చేయాలి. ఆధార్ కార్డు ప్రెసిడెంట్ సర్టిఫికెట్ , రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్, బ్యాంక్ అకౌంట్ , ఎన్పీసీఐ రన్నింగ్ లో ఉండాలి. కుటుంబ సభ్యులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగిగా పెన్షన్ పొందేలా ఉండకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఉంది.