Chandrababu Baile : ముగిసిన సిఐడి కస్టడీ వాదనలు…చంద్రబాబు బెయిల్…తీర్పు రిజర్వ్…

Chandrababu Baile  : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు దాకలు చేసిన బెయిల్ ,మరియు సిఐడి కస్టడీ పిటిషన్ పై ఏసిబి కోర్టులో ఇటీవల వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదించగా ,సిఐడి తరఫున ఎజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వారి వాదనలను కోర్టుకు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో […]

  • Published On:
Chandrababu Baile : ముగిసిన సిఐడి కస్టడీ వాదనలు…చంద్రబాబు బెయిల్…తీర్పు రిజర్వ్…

Chandrababu Baile  : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు దాకలు చేసిన బెయిల్ ,మరియు సిఐడి కస్టడీ పిటిషన్ పై ఏసిబి కోర్టులో ఇటీవల వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదించగా ,సిఐడి తరఫున ఎజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వారి వాదనలను కోర్టుకు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో సోమవారం రోజున తీర్పు వెలువరిస్తామని కోర్టు తెలియజేసింది. అయితే బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు న్యాయవాదులు గురువారం రోజు వాదనలను పూర్తి చేయగా…

cid-custody-arguments-over-chandrababu-bail-judgment-reserved

సిఐడి తరపు న్యాయవాది ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి కొన్ని వాదనలను వినిపించాల్సి ఉందని కోరారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన మరికొన్ని అంశాలను కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈరోజు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అనంతరం సిఐడి దాఖలు చేసిన కష్టడీ పిటిషన్ పై వాదనలు జరుగగా…సిఐడి తరపు న్యాయవాది వాదిస్తూ వారి యొక్క బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని ఈ నేపథ్యంలో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. అనంతరం చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే చంద్రబాబును ఒకసారి కస్టడీకి ఇచ్చామని…రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇరుపక్ష వాదనలు విన్న ఏసీబీ కోర్టు సోమవారం రోజు తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.