Chandrababu Naidu : జైలు నుండి బయటకు వచ్చాక మొదటిసారి మాట్లాడిన చంద్రబాబు…

Chandrababu Naidu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాలు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ తరుణంలో బయటకు వచ్చిన చంద్రబాబు అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అందరికీ నమస్కారం..నేను కష్ట కాలంలో ఉన్నప్పుడు నా కోసం మీరంతా 52 రోజులు ఎక్కడికి అక్కడ రోడ్డు మీదకు వచ్చి సంఘీభావాన్ని […]

  • Published On:
Chandrababu Naidu : జైలు నుండి బయటకు వచ్చాక మొదటిసారి మాట్లాడిన చంద్రబాబు…

Chandrababu Naidu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాలు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ తరుణంలో బయటకు వచ్చిన చంద్రబాబు అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అందరికీ నమస్కారం..నేను కష్ట కాలంలో ఉన్నప్పుడు నా కోసం మీరంతా 52 రోజులు ఎక్కడికి అక్కడ రోడ్డు మీదకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. నాకోసం ప్రార్థించారు. నాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పటికీ మరువలేను. అలాగే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ ధన్యవాదాలు.

chandrababu-spoke-for-the-first-time-after-coming-out-of-jail

నాపై మీరు చూపిస్తున్న అభిమానం ఎనలేనిది. అలాగే నేను చేసిన అభివృద్ధిని కూడా చూపించారు. అధికారంలో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో వారంతా రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేశారు. నిజంగా నా జీవితం ధన్యమైంది. ఎందుకంటే ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు పొందలేడు. ఇక 45 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చేయలేదు. చేయను కూడా అది నా నిబద్ధత. ఇక రాష్ట్రంలో ఉండే మరియు ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. అలాగే ఇతర రాజకీయ పార్టీలు కూడా సంఘీభావాన్ని తెలియజేశాయి. వాళ్లని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

chandrababu-spoke-for-the-first-time-after-coming-out-of-jail

మరి ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే బిజెపి సిపిఐ బిఆర్ఎస్ అలాగే కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా నాకు సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు. అలాగే కొంతమంది అయితే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర కూడా చేశారు. అలాగే హైదరాబాద్ మహానగరంలోని ఐటీ ప్రొఫెషనల్ కూడా సంఘీభావం తెలియజేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా పేరుపేరునా కృతజ్ఞతలు అభినందనలు. 45 ఏళ్లుగా నేను కష్టపడి చేసిన విషయాలను ఈ 52 రోజులు గుర్తు చేసుకున్నారు. అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.