Chandrababu Bail : చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు…

Chandrababu Bail  : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త ఊరట ఇచ్చింది. అంగళ్ళ కేసులో ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం చంద్రబాబు కు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తితో చంద్రబాబుకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇక అంగళ్ళ కేసులో ఏ1 గా ఉన్న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో టిడిపి నేతలకు కాస్త ఊరట లభించింది. కాగా గురువారం రోజు అంగళ్ళ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ […]

  • Published On:
Chandrababu Bail : చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు…

Chandrababu Bail  : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త ఊరట ఇచ్చింది. అంగళ్ళ కేసులో ఆంధ్రప్రదేశ్ ధర్మాసనం చంద్రబాబు కు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తితో చంద్రబాబుకు ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇక అంగళ్ళ కేసులో ఏ1 గా ఉన్న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో టిడిపి నేతలకు కాస్త ఊరట లభించింది. కాగా గురువారం రోజు అంగళ్ళ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలను విని తీర్పును వెలవరించకుండా రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శుక్రవారం రోజు దీనికి సంబంధించి తీర్పును వెల్లడించింది.

chandrababu-granted-anticipatory-bail

అయితే ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులను వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను సందర్శించేందుకు “సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్దభేరి ” పేరుతో ప్రకటించారు. ఈ యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న సందర్భంలో అంగళ్లు మీదుగా చంద్రబాబు వెళ్లడం జరిగింది. ఇక ఆ సమయంలో వైసీపీ మరియు టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీంతో చంద్రబాబుతో పాటు టిడిపి పార్టీకి చెందిన 179 మంది నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనిలో చంద్రబాబును ఏ1 గా చేర్చడం జరిగింది .

chandrababu-granted-anticipatory-bail

ఇక ఈ కేసులో హత్యాయత్నంతో పాటు వివిధ రకాల సెక్షన్లను పెట్టి కేసు నమోదు చేయడంతో టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ధర్మాసనం పలువురికి బెయిల్ ని కూడా మంజూరు చేసింది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇదే కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కాస్త ఊరట లభించినట్లు అయింది. ఇది ఇలా ఉండగా చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో సిఐడి అధికారుల కాల్ రికార్డు ఇవ్వాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న ఏసిబి కోర్ట్ న్యాయమూర్తి ఈ కేసును అక్టోబర్ 18 కు వాయిదా వేశారు.