Alia Bhatt : అలియా భట్ చేసిన పనికి అభిమానుల ప్రశంసలు….అంతటి స్టార్ హోదాలో ఉండి కూడా ఎలాంటి గర్వం లేకుండా….
Alia Bhatt : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన కొందరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఫామ్ లో ఉన్న కొందరు ముద్దుగుమ్మలు హెడ్ వెయిట్ ను ప్రదర్తిస్తున్నారు. ఇక అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం.. అయితే అందుకు భిన్నంగా ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన ఓ పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. […]
Alia Bhatt : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన కొందరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఫామ్ లో ఉన్న కొందరు ముద్దుగుమ్మలు హెడ్ వెయిట్ ను ప్రదర్తిస్తున్నారు. ఇక అలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం.. అయితే అందుకు భిన్నంగా ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన ఓ పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతటి స్టార్ హోదాలో ఉండి కూడా ఎలాంటి హెడ్ వెయిట్ చూపించకుండా ఆమె చేసిన పనికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అలియాభట్ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని టాప్ పొజిషన్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పెళ్లి చేసుకుని ఓ బేబీకి జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం ఒకవైపు మ్యారేజ్ లైఫ్ ను కొనసాగిస్తూనే , సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. త్వరలో “రాఖి ఔర్ రాణి కి ప్రేమ కహాని” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవల అలియా భట్ తన తల్లితో కలిసి ముంబైలోని ఓ ప్రాంతంలో దర్శనమిచ్చింది. దీంతో ఫోటోగ్రాఫర్స్ ఆమెను ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు.
ఈ నేపథ్యంలో అలియా భట్ ఫోటోగ్రాఫర్స్ ను డిసప్పాయింట్ చేయకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అలా ఫొటోస్ తీస్తూ పరిగెడుతున్న క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ చెప్పు జారిపడిపోయింది.. అది గమనించిన ఆలియా భట్ ఏ మాత్రం మొహమాట పడకుండా తనను తాను గొప్పగా చూసుకోకుండా ఆ చెప్పు ఎవరిదని అడిగి తన చేతితో స్వయంగా చెప్పును తీసి కెమెరా మెన్ కు అందించింది. అంతటి స్టార్ హోదాలో ఉండి కూడా ఎలాంటి గర్వం లేకుండా ఆలియా భట్ చేసిన పనికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. నీలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ సింప్లిసిటీకి అందరు మెచ్చుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Awww #AliaBhatt is just sooo helpful 🥺💗
She picks up a chappal which is one of the paps left bymistake, isnt she just too adorable 😍@aliaa08 @viralbhayani77 pic.twitter.com/u5Blu1990K— Viral Bhayani (@viralbhayani77) July 13, 2023