Anasuya : తల్లి కాబోతున్న అనసూయ…ఆ స్టార్ హీరోతో.
Anasuya : మొన్నటివరకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా మారింది. ఇటీవల విమానం అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ పాత్రలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకపక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో కూడా చేస్తుంది. అదేవిధంగా మరికొన్ని పాత్రను ఎంపిక […]
Anasuya : మొన్నటివరకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా మారింది. ఇటీవల విమానం అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ పాత్రలను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకపక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అద్భుతంగా నటిస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో కూడా చేస్తుంది. అదేవిధంగా మరికొన్ని పాత్రను ఎంపిక చేస్తూనే క్రమంలో కథలను వింటుంది.
అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ , పబ్లిసిటీ , ఫ్యాన్ ఫాలోయింగ్ అనసూయ కి ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ స్థాయికి రావడానికి ఆమె ఎంతో కష్టపడిందని చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే అనసూయ తరచు ఏదో రకంగా ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటుంది. అంతేకాక తనని టోల్ చేసిన వారికి వార్నింగ్ ఇస్తూ మరింత వైరల్ అవుతూ ఉంటుంది. తనని ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగా సమాధానం చేబుతూ ఎంతకైనా తెగిస్తుంది. ఈ తరహా వైఖరి అయితే చాలామందికి నచ్చదు. కానీ ఈ ముద్దుగుమ్మకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి.
ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు అనేక రకాల పాత్రలలో కనిపించిన అనసూయ ఇప్పుడు స్టార్ హీరోకు తల్లి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరో చిన్నప్పటి పాతకు మాత్రమే అనసూయ తల్లిగా ఉంటుందట. అంతేకాక ఆ పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని చెబుతున్నారు. తల్లి సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తల్లి పాత్ర చేస్తే ఆమెను ట్రోల్ చేస్తారని తెలుసు. అయినప్పటికీ ఈ పాత్ర చేయడానికి అనసూయ ఒప్పుకున్నారు. ఇక ఈ వార్తలలో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.