Rakesh Master : చనిపోయి కూడా ఇతరులకు సాయపడుతున్న రాకేష్ మాస్టర్…నిజంగా మీరు గ్రేట్ సార్…

Rakesh Master : ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే..ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అయితే శనివారం రోజు రక్త విరోచనాలు అవ్వడంతో రాకేష్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది . దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే రాకేష్ […]

  • Published On:
Rakesh Master : చనిపోయి కూడా ఇతరులకు సాయపడుతున్న రాకేష్ మాస్టర్…నిజంగా మీరు గ్రేట్ సార్…

Rakesh Master : ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే..ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అయితే శనివారం రోజు రక్త విరోచనాలు అవ్వడంతో రాకేష్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది . దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే రాకేష్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. అయితే రాకేష్ మాస్టర్ డయాబెటిస్ పేషెంట్ అవడం వలన సివియర్ మెటబాలిక్ ఏసిడోసిస్ అవడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగి షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయని దాని కారణంగానే ఆయన మరణించారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

rakesh-master-helping-others-even-after-death-you-are-really-great-sir

అయితే రాకేష్ మాస్టర్ తెలుగు ఇండస్ట్రీలో దాదాపుగా 1500 సినిమాలకు పైగా డాన్స్ మాస్టర్ గా వ్యవహరించారు. అయితే మొదటగా రాకేష్ మాస్టర్ ముక్కు రాజు మాస్టర్ వద్ద జూనియర్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత “లాహిరి లాహిరి లాహిరి”లో మరియు దేవదాసు ,చిరునవ్వుతో , సీతయ్య వంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా ఆయన పని చేశారు. అంతేకాక స్టార్ హీరో ప్రభాస్ ,వేణు , మరియు నటి ప్రత్యూష వంటి సెలబ్రిటీలు కూడా రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ మెలకువలు నేర్చుకునేవారు. ఒకప్పుడు రాకేష్ మాస్టర్ కి అంతటి క్రేజ్ ఉంది మరి. ఇక ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే..

rakesh-master-helping-others-even-after-death-you-are-really-great-sir

ఇదిలా ఉంటే రాకేష్ మాస్టర్ తాను చనిపోయే ముందు తన శరీరంలో పనికొచ్చే అవయవాలను లేని వారికి దానం చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ తెలియజేశారు. దీంతో డాక్టర్లను పోస్టుమార్టం చేసి అవయవాలను తీసుకున్న తర్వాత బాడిని అప్పజెప్పాల్సిందిగా కోరాడు సాజిద్. ఆ తర్వాత దహన సంస్కారాలు చేసుకుంటామని ఆయన తెలియజేశారు. ఇక దీనికి వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. దీంతో చూపు లేని వారికి రాకేష్ మాస్టర్ కళ్ళను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు సమ్మతం తెలిపారు. తను చనిపోతూ కూడా అవయవాలను డొనేట్ చేయాలనుకున్న రాకేష్ మాస్టర్ గొప్ప మనసుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు జోహార్ రాకేష్ మాస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.