Salaar Movie 2nd Day Collection : సలార్ రెండవ రోజు వసూళ్ల మోత…

Salaar Movie 2nd Day Collection : బాహుబలి వంటి భారీ హిట్ తర్వాత సరైన హిట్ కోసం వేచి చూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పటివరకు సరైన హిట్టు లభించలేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందించింది. భారీ అంచనాలతో తాజాగా విడుదలైన ఈ సలార్ సినిమా బాక్సాఫీస్ ను శాసిస్తుంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే దాదాపు […]

  • Published On:
Salaar Movie 2nd Day Collection : సలార్ రెండవ రోజు వసూళ్ల మోత…

Salaar Movie 2nd Day Collection : బాహుబలి వంటి భారీ హిట్ తర్వాత సరైన హిట్ కోసం వేచి చూస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పటివరకు సరైన హిట్టు లభించలేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందించింది. భారీ అంచనాలతో తాజాగా విడుదలైన ఈ సలార్ సినిమా బాక్సాఫీస్ ను శాసిస్తుంది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే దాదాపు 178 కోట్లు వసూలుచేసి రికార్డు నెలకొల్పింది. ఇక రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే…ఈ సినిమాను 270 కోట్ల రూపాయలతో తరకెక్కించగా…ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల రూపాయలు జరిగింది.

సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేయడంతో పాటు ఇప్పటికీ అదే జోష్ కొనసాగుతూ వస్తుంది.  ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా 178.7 కోట్ల రూపాయలు గ్రాస్ ను సలార్ సినిమా సాధించింది.  ఈ క్రమంలోనే ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన తొలి సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్ కొనసాగింది. తొలి రోజు కంటే రెండవ రోజు 30% కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అయినప్పటికీ టాప్ రేంజ్ హీరో లు రెండో రోజు సాధించిన వసూలతో పోల్చి చూసినట్లయితే సలార్ రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువనే ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.

ఇక భారత దేశంలో సలార్ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే…దేశవ్యాప్తంగా ఈ సినిమా 90 వేల కోట్ల రూపాయలను సాధించింది. తెలుగు ఇండస్ట్రీలో 67 కోట్ల రూపాయలు మలయాళం లో నాలుగు కోట్లు , తమిళంలో నాలుగు కోట్లు కర్ణాటకలో 8 కోట్లు వసూలు సాధించింది. ఇక హిందీలో దాదాపు 16 కోట్లు నికరంగా సాధించింది. ఇక రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికొస్తే…రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోకు 70% , మ్యాట్నీకి 80% , ఫస్ట్ షో కి 80% , సెకండ్ షోకి 80% కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇక మలయాళం లో చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 40% , తమిళంలో 30% కనడంలో 60% హిందీలో 40% వసూలు సాధించింది.