Viral News : 14 ఏళ్ళ వయసుకే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు….ఇలాంటివాడు కోటికిి ఒకడుంటాడు…

Viral News : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది చాలా ప్రత్యేకమైనదిగా తయారైంది. ఉద్యోగం లేకపోతే నలుగురిలో మర్యాద కూడా ఉండడం లేదు. మరి ముఖ్యంగా ఇలాంటివి పురుషులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం. కానీ ప్రస్తుత కాలంలో జాబ్ దొరకడం చాలా కష్టతరంగా మారింది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే 14 ఏళ్ల కుర్రాడు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాడు. 14 ఏళ్ల వయసుకే […]

  • Published On:
Viral News : 14 ఏళ్ళ వయసుకే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు….ఇలాంటివాడు కోటికిి  ఒకడుంటాడు…

Viral News : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేది చాలా ప్రత్యేకమైనదిగా తయారైంది. ఉద్యోగం లేకపోతే నలుగురిలో మర్యాద కూడా ఉండడం లేదు. మరి ముఖ్యంగా ఇలాంటివి పురుషులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం. కానీ ప్రస్తుత కాలంలో జాబ్ దొరకడం చాలా కష్టతరంగా మారింది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే 14 ఏళ్ల కుర్రాడు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాడు. 14 ఏళ్ల వయసుకే ఉద్యోగం సాధించాడు. అది కూడా చిన్నాచితక కంపెనీ కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ కంపెనీ ఏరి కోరి మరి ఈ పిల్లాడిని ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఆ పిల్లాడి ప్రతిభ అలాంటిది మరి. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు ..? అతని కథ ఏంటి అంటే…

Santa Clara University student Kairan Quazi, seated, shares some of his software coding with his professors, Ahmed Amer, right, and Nam Ling, in a computer lab at Santa Clara University on Saturday, May 20, 2023, in Santa Clara, Calif. Quazi, 14, a Computer Science and Engineering major, is graduating with a Bachelor of Science degree in June, 2023. (Photo by Jim Gensheimer)

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ పిల్లాడు తన తల్లితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆ పిల్లాడి పేరు కరెన్ కాజీ. అయితే కరెన్ మూడో తరగతి చదువుతున్న వయసులోనే తన తోటి పిల్లల కంటే చాలా వేగంగా నేర్చుకునేవాడట. ఇక అది గమనించిన ఉపాధ్యాయులు పిల్లాడిని చిన్నపిల్లల వైద్యుని దగ్గరకు తీసుకుపోగా పిల్లాడి ఐక్య లెవెల్స్ చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి పిల్లాడిని పై తరగతులకు రిఫర్ చేశారు. కరెన్ కు మంచి ఐక్యు తో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండడంతో తన వయసు పిల్లల కంటే తనకి మానసిక పరినితి కూడా ఎక్కువగానే ఉంది. దీంతో కేవలం 9 సంవత్సరాల వయసులోనే కరెన్ లాస్ పోసిటాస్ కమ్యూనిటీ కాలేజ్ లో చేరాడు. ఇక అక్కడ రెండు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకున్న తర్వాత , 11 ఏళ్ల వయసులో శాంటా క్లారా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు.

 

గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే సమయంలో అతను ఇంటెల్ ల్యాబ్స్ లో , ఇంటర్న గా పని చేశాడు. తనలో దాగి ఉన్న ఈ ప్రతిభ కారణంగా కరెన్ ఎలాన్ మస్క్ కంపెనీలో స్పేస్ సెక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎంపిక అయ్యాడు. ఇంకొన్ని రోజుల్లో కరెన్ ఉద్యోగంలో చేరబోతున్నాడు. ఇక అతని గురించి తెలిసిన ప్రపంచం ఆశ్చర్య పోతుంది. ఈ న్యూస్ తెలుసుకున్న కొందరు పిల్లాడు తన బాల్యాన్ని కోల్పోతున్నాడని కామెంట్స్ చేస్తుంటే , దానికి సమాధానంగా కరెన్ నేను నా బాల్యాన్ని కోల్పోలేదని, నాకు ఇలా చదువుకోవడం అలాగే అవకాశాలు అందుకుని ముందుకు వెళ్లడం అంటేనే చాలా ఇష్టమని చెప్పు కొచ్చాడు. కేవలం 14 ఏళ్ల వయసుకే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ సాధించిన కుర్రాడిని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయి చూస్తుంది. ఇలాంటివారు కోటికి ఒకరు ఉంటారని అందరూ అంటున్నారు.