Viral News : లాంగ్ ట్రిప్ పేరుతో దారుణం…తెలివిగా వధువును హతమార్చిన వరుడు…నిజం తెలిసాక అందరూ షాక్…

Viral News  : ఉత్తరప్రదేశ్ కి చెందిన సంజయ్ కుమార్ పాత మెట్రోపాలిస్ ఘోసియానాలో నివసిస్తున్నాడు. ఇతను చాలా పేదవాడు. బెలూన్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని కూతురు కోమల్. ఒకసారి కోమల్ దగ్గర్లో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళింది. అక్కడ షాప్ నడుపుతున్న రాహుల్ తో కోమల్ కి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా వారు రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే పెళ్లి […]

  • Published On:
Viral News : లాంగ్ ట్రిప్ పేరుతో దారుణం…తెలివిగా వధువును హతమార్చిన వరుడు…నిజం తెలిసాక అందరూ షాక్…

Viral News  : ఉత్తరప్రదేశ్ కి చెందిన సంజయ్ కుమార్ పాత మెట్రోపాలిస్ ఘోసియానాలో నివసిస్తున్నాడు. ఇతను చాలా పేదవాడు. బెలూన్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని కూతురు కోమల్. ఒకసారి కోమల్ దగ్గర్లో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళింది. అక్కడ షాప్ నడుపుతున్న రాహుల్ తో కోమల్ కి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా వారు రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామని రాహుల్ కి చెప్పింది. రాహుల్ కి పెళ్లి చేసుకోకపోవడం ఇష్టం లేకపోయినా ఆమె ఒత్తిడి భరించలేక సరే అన్నాడు.

దీంతో కోమల్ కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. రాహుల్ తో పెళ్లి చేయడానికి కోమల్ తండ్రి ఒప్పుకున్నాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు.అయితే పెళ్లి రోజు బ్యూటీ పార్లర్ కి వెళ్లోస్తానని చెప్పిన బయటకు వెళ్లిన కోమల్ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. వాళ్ళు పట్టించుకోకపోవడంతో కోమల్ తండ్రి తెలిసిన వారి సాయంతో సోషల్ మీడియాలో తన కూతురుని కాపాడమని పోస్ట్ పెట్టాడు. పోస్ట్ వైరల్ అయింది. దీంతో పోలీస్ లు రంగంలోకి దిగి కోమల్ కాల్ వివరాలు, చివరి లొకేషన్ ఆధారంగా ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. కుక్రైల్ అడవుల్ల కోమల్ మృతదేహం దొరికింది.

కోమల్ మొబైల్ లో లాస్ట్ కాల్ రాహుల్ ది కావడంతో అతన్ని గట్టిగా విచారించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కోమల్ ఒత్తిడి చేసిందని, అందుకే పెళ్లికి ఒప్పుకున్నానని చెప్పాడు. కానీ అతను పెళ్లికి ఒప్పుకున్నందుకు అతని ఫ్యామిలీ తనతో మాట్లాడలేదు. మాతో తెగదెంపులు చేసుకోమని వారు రాహుల్ ను హెచ్చరించారట. దీంతో అతను ప్లాన్ ప్రకారం కోమల్ ని బ్యూటీ పార్లర్ కి తీసుకు వెళతానని చెప్పాడు. ఆ విషయం ఇంట్లో చెప్పవద్దని అతను ముందే హెచ్చరించాడు. లాంగ్ ట్రిప్ పేరుతో కోమల్ ని అడవులకి తీసుకెళ్లి చున్నితోనే కోమల్ గొంతుని బిగించి చంపేశాడు. దీంతో అతనిపై కేసు దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు.