Kiwi health benefits : పండు ఒక్కటే ఫలితాలు ఎన్నో .. మరి ముఖ్యంగా మగవాళ్లకు ..??

Kiwi health benefits  : మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటే కీవీ పండు. ఇది శరీరానికి కావలసిన అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. కీవీ పండును గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, కంటి వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. కీవీ పండ్లలో విటమిన్ కె, ఇ, సి , పొటాషియం మొదలైనవి ఉంటాయి. కీవీలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరి గుణాల వలన చర్మంపై ఉండే దద్దుర్లు, […]

  • Published On:
Kiwi health benefits : పండు ఒక్కటే ఫలితాలు ఎన్నో .. మరి ముఖ్యంగా మగవాళ్లకు ..??

Kiwi health benefits  : మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఒకటే కీవీ పండు. ఇది శరీరానికి కావలసిన అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. కీవీ పండును గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, కంటి వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. కీవీ పండ్లలో విటమిన్ కె, ఇ, సి , పొటాషియం మొదలైనవి ఉంటాయి. కీవీలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరి గుణాల వలన చర్మంపై ఉండే దద్దుర్లు, మొటిమలు, వాపులను తగ్గించి చర్మాని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. కీవీ తినడం వలన శరీరంలో రక్తం గడ్డ కట్టడం సమస్య ఏర్పడదు. ఇది యాంటీ క్లాటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.

eating-kiwi-fruit-will-remove-all-these-problems-especially-for-men

స్ట్రోక్, కిడ్నీ మరియు గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని తొలగించడంలో కీవీ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం, కడుపు మంట వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు కీవీ పండును తింటే మంచి ఫలితం లభిస్తుంది. కీవీ పండు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. తరచుగా తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీవి అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

eating-kiwi-fruit-will-remove-all-these-problems-especially-for-men

కీవీలో తగినంత మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. చర్మం ఎల్లప్పుడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే కీవీ పండును తప్పనిసరిగా తినాలి. తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కీవీ పళ్ళను తింటే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో కీవీ పండు అద్భుతంగా పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ఆ గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కీవీ పండు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు కీవీ పండును తీసుకోవడం వలన అనేక ఆరోగ్యం ప్రయోజనాలు కలుగుతాయి.