Lemon benifits : నిమ్మకాయను సిట్రస్ పండు అని ఎందుకు పిలుస్తారు తెలుసా…ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే…

Lemon benifits : నిమ్మకాయ చాలా విలక్షణమైన రుచిని మరియు వాహనను కలిగిన ఆరోగ్యకరమైన పండు. దీని యొక్క శాస్త్రీయ నామం సిట్రస్ లిమోన్. నిమ్మకాయలు విటమిన్ సిట్రిక్ యాసిడ్ మరియు ఎస్ఎంసిల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి . అంతేకాక దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా కలిగి ఉంది. అంతేకాక నిమ్మలో ఉండే కణాలు మూత్రపిండాలు రక్షణకు చాలా బాగా సహాయపడతాయి. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం […]

  • Published On:
Lemon benifits : నిమ్మకాయను సిట్రస్ పండు అని ఎందుకు పిలుస్తారు తెలుసా…ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే…

Lemon benifits : నిమ్మకాయ చాలా విలక్షణమైన రుచిని మరియు వాహనను కలిగిన ఆరోగ్యకరమైన పండు. దీని యొక్క శాస్త్రీయ నామం సిట్రస్ లిమోన్. నిమ్మకాయలు విటమిన్ సిట్రిక్ యాసిడ్ మరియు ఎస్ఎంసిల్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి . అంతేకాక దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా కలిగి ఉంది. అంతేకాక నిమ్మలో ఉండే కణాలు మూత్రపిండాలు రక్షణకు చాలా బాగా సహాయపడతాయి. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని దానిలో తేన ని కలుపుకుని తాగితే బరువు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే వికారంగా అనిపించినప్పుడు నిమ్మకాయ నీటిలో ఉప్పును కలుపుకుని తాగితే వికారం తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇవేకాక నిమ్మకాయలో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

do-you-know-why-lemon-is-called-a-citrus-fruit-because-it-has-so-many-benefits

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది…

నిమ్మకాయలో విటమిన్ సి ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు మరియు హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. అయితే ఒక పరిశోధన ప్రకారం ప్రతిరోజు 24 గ్రాముల సిట్రస్ ఫైబర్ ను తీసుకోవడం వలన కేవలం నెల రోజుల్లోనే రక్తంలోని మొత్తం కొలస్ట్రాల స్థాయిలను తగ్గించవచ్చని నిరూపించబడింది.

రక్తహీనతను నివారిస్తుంది…

రక్తహీనత అనేది ఇనుము లోపం వలన సంభవిస్తుంది. ఇది ఎక్కువగా రుతుక్రమణ సమయంలో మహిళలను ప్రభావితం చేస్తుంది. అయితే నిమ్మకాయలో ఎక్కువ ఇనుము ఉండనప్పటికీ , ఇది భోజనం నుండి ఇనుము సూచనలను మెరుగుపరిచి రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది.

క్యాన్సర్ బారిన పడకుండా…

నిమ్మకాయ రొమ్ము క్యాన్సర్ మరియు ఇతర క్యాన్సర్లు రాకుండా ఉండేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిలో ఉండే హేస్పెరిడిన్ , డీ- లిమోనన్ లక్షణాలు రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సహాయ పడతాయి.

మూత్రపిండాల్లో రాళ్లను తొలగించేందుకు..

పుల్లని పండ్లు మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిలో ఉన్న కాల్షియం ఆక్సలైట్ స్పటికాల నిక్షేపణను తగ్గించి మూత్రపిండాల్లోని రాళ్ళను తొలగిస్తాయి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని , ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.