Ram gopal varma : జయసుధతో వర్మ ప్రేమాయణం.. వీరి పెళ్లిని అడ్డుకున్నది ఎవరంటే..
Ram gopal varma : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మనసులో ఏమున్నా సరే నిర్మొహమాటంగా బయట పెట్టేస్తారు. అందుకే ఆయనను కొంతమంది ఇష్టపడితే మరి కొంతమంది విరక్తి చూపిస్తారు. ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నారు వర్మ. అయితే వర్మ డైరెక్టర్ కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో తరణి రావు అనే డైరెక్టర్ […]
Ram gopal varma : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన మనసులో ఏమున్నా సరే నిర్మొహమాటంగా బయట పెట్టేస్తారు. అందుకే ఆయనను కొంతమంది ఇష్టపడితే మరి కొంతమంది విరక్తి చూపిస్తారు. ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నారు వర్మ. అయితే వర్మ డైరెక్టర్ కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో తరణి రావు అనే డైరెక్టర్ వద్ద పనిచేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో “రావుగారిల్లు” అనే చిత్రానికి తరణి రావు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో జయసుధ హీరోయిన్ గా నటిస్తుండగా, జయసుధను ఇంప్రెస్ చేయడానికి వర్మ తెగ ట్రై చేసేవారట.
అప్పటికే ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది కానీ ఒక హీరోయిన్ తో నాకు పరిచయం ఉందని చెప్పుకోవాలనే ఆలోచనలో ఉండేవాడు వర్మ. ఇక అదే సమయంలో తరణి రావు సీన్ పేపర్ తీసుకెళ్లి జయసుధ గారి ఇంట్లో ఇచ్చి రమ్మని, అలాగే ఆ సీన్స్ కూడా వర్మను రాయమని చెప్పాడట. దాంతో వర్మ రాత్రంతా కూర్చుని ఆమెను తన మనసులో ఊహించుకుంటూ అందంగా రాయడానికి ప్రయత్నించాడట. కానీ తన చేతిరాత బాగోలేదని మంచిగా రాసేందుకు ప్రయత్నించి చివరికి జయసుధ షూటింగ్ కి వచ్చే సమయం కి సీన్ పేపర్ ఆమెకు ఇచ్చాడట. జయసుధ ఆ సీన్ పేపర్ చూసి ఎవరు ఇంత బాగా రాశారని అడుగుతుందనే భావనలో వర్మ ఉన్నాడు.
అంతేకాక తనలో తానే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసుకున్నారట. కానీ జయసుధ ఆ పేపర్ చూసి ఎన్ని పేజీలు అని అడిగేసరికి వర్మ ఉత్సాహం కాస్త ఆవిరిపోయింది. ఎన్నో వందల సినిమాలు చేసి కొన్ని వేల సీన్స్ చదివిన ఆమె అనుభవం ముందు వర్మ తెలివి పనిచేయలేదు. ఇక ఆ తర్వాత “మనీ” సినిమా కోసం వర్మ జయసుధ ఇంటికి టిప్ టాప్ గా రెడీ అయి వెళ్లి ఇంటి కాలింగ్ బెల్ కొట్టగా జయసుధ భర్త నితిన్ కపూర్ డోర్ తీశారట. దీంతో విస్తీపోయిన వర్మ మళ్ళీ జయసుధ వైపు చూడలేదని సమాచారం. కానీ వర్మ జయసుధ పై తనకు ఉన్న ప్రేమను ఆమెకు తెలపాలని ట్రై చేసాడట . కాని ఏమైందో తెలియదు వర్మ జయసుధ పై తనకున్న ప్రేమను తనలోని దాచేసుకున్నారని సమాచారం.