Ramgopal Varma : రాంగోపాల్ వర్మ షాక్ ఇచ్చిన హైకోర్టు…వ్యూహం సినిమా నిలుపుదల…

Ramgopal Varma  : రాంగోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉంటారు. అదేవిధంగా తనకు నచ్చినట్లుగా జీవితాన్ని గడుపుతూ ఎలాంటి వాళ్లనైనా సరే అవలీలగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే కాంట్రవర్సీలతో పాటు కాంట్రవర్సీ సినిమాలు తీయడం రాంగోపాల్ వర్మ నైజం అని చెప్పాలి. జీవిత చరిత్రలను స్పష్టంగా చూపిస్తూ రాంగోపాల్ వర్మ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు […]

  • Published On:
Ramgopal Varma : రాంగోపాల్ వర్మ షాక్ ఇచ్చిన హైకోర్టు…వ్యూహం సినిమా నిలుపుదల…

Ramgopal Varma  : రాంగోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉంటారు. అదేవిధంగా తనకు నచ్చినట్లుగా జీవితాన్ని గడుపుతూ ఎలాంటి వాళ్లనైనా సరే అవలీలగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు. అయితే కాంట్రవర్సీలతో పాటు కాంట్రవర్సీ సినిమాలు తీయడం రాంగోపాల్ వర్మ నైజం అని చెప్పాలి. జీవిత చరిత్రలను స్పష్టంగా చూపిస్తూ రాంగోపాల్ వర్మ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వర్మ వ్యూహం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కానీ హైకోర్టు రాంగోపాల్ వర్మకు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రాంగోపాల్ వర్మ తాజాగా నిర్మించిన వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది.

RGV : ''వ్యూహం'' సినిమా రిలీజ్‌పై ఆర్జీవీకి హైకోర్టు షాక్ ...! | High Court orders postponing the release of the film vyuham for 3 weeks

దీనికి గల కారణం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేయాల్సిందిగా నారా లోకేష్ వేసిన పిటిషన్ పై తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వడం అని చెప్పాలి. అయితే నారా లోకేష్ వేసిన పిటిషన్ పై సుదీర్ఘ చర్చలు జరిపిన హైకోర్టు తాజాగా వ్యూహం సినిమా సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ను నిలిపివేస్తూ హైకోర్టు కు తీర్పు ఇచ్చింది. మరో మూడు వారాలలో మళ్ళీ రివ్యూ చేసి రిపోర్ట్ ను ఇవ్వాల్సిందిగా సెన్సార్ బోర్డుకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నారా లోకేష్ వ్యూహం సినిమాను రద్దు చేయాలని వేసిన పిటిషన్ పై ,ల్హైకోర్టు ఇప్పటికే పదిసార్లు వాయిదా వేస్తూ వస్తుండగా ..చివరికి ఇటీవల సోమవారం నాడు ఈ కెసుపై తీర్పును వెల్లడించింది.

ఈ క్రమంలోనే సినిమాపై మరోసారి రివ్యూ జరపాలని హైకోర్టు సెన్సార్ బోర్డ్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడిందని చెప్పాలి. అయితే ఈ వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ లో ఒక భాగమని ఇప్పటికే పలుసార్లు గుసగుసలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ వ్యూహం సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో టిడిపి నేతలు కోర్టును ఆశ్రయించి ఈ సినిమాలోని పలు సన్నివేశాలు అవాస్తవంగా ఉన్నందున సినిమాను రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేశారు.