Viral Video : ఒకే ఒక్క వీడియోతో ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా కానిస్టేబుల్…ఇలా కూడా సస్పెండ్ చేస్తారా…

Viral Video : ఫోటోలో కనిపిస్తున్న కానిస్టేబుల్ చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించి మంచి గౌరవాన్ని పొందుతూ జీవనాన్ని సాగిస్తుంది. ఇక అంతా బాగుంది అనుకున్న టైంలో వెనుక ముందు ఆలోచించకుండా చేసిన ఒకే ఒక్క వీడియో తన ఉద్యోగానికి ఎసరు పెట్టింది. అయితే సోషల్ మీడియా మోజులో నేటి తరం యువత తెచ్చుకుంటున్న సమస్యలు ఏంటో ఇది ఒక ఉదాహరణగా చూపించవచ్చు. ఆ ఒక్క వీడియోతో ఈ మహిళ సోషల్ మీడియా లో అలాగే […]

  • Published On:
Viral Video : ఒకే ఒక్క వీడియోతో ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా కానిస్టేబుల్…ఇలా కూడా సస్పెండ్ చేస్తారా…

Viral Video : ఫోటోలో కనిపిస్తున్న కానిస్టేబుల్ చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించి మంచి గౌరవాన్ని పొందుతూ జీవనాన్ని సాగిస్తుంది. ఇక అంతా బాగుంది అనుకున్న టైంలో వెనుక ముందు ఆలోచించకుండా చేసిన ఒకే ఒక్క వీడియో తన ఉద్యోగానికి ఎసరు పెట్టింది. అయితే సోషల్ మీడియా మోజులో నేటి తరం యువత తెచ్చుకుంటున్న సమస్యలు ఏంటో ఇది ఒక ఉదాహరణగా చూపించవచ్చు. ఆ ఒక్క వీడియోతో ఈ మహిళ సోషల్ మీడియా లో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే…

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాస్ గంజ్ జిల్లా లో చోటుచేసుకుంది. ఇక అదే ప్రాంతానికి చెందిన ఆర్తి సోలంకి అనే మహిళా కానిస్టేబుల్ గా విధులను నిర్వహిస్తుంది. అయితే ఆమెకి ఎప్పటినుండో instagram రీల్స్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేసి జనాలతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈ మహిళా కానిస్టేబుల్ కు సోషల్ మీడియాపై యావా ఎక్కువైపోవడంతో ఒకరోజు పోలీస్ యూనిఫామ్ ధరించి వీడియో రికార్డ్ చేసింది. బాలీవుడ్ బాద్షా అమితాబచ్చన్ నటించిన 1980 ల నాటి సినిమాలోని ఓ పాటకు ఆమె రీల్ చేసింది. అనంతరం ఆ వీడియోని నెట్టింట పంచుకుంది. ఇక మన జనం సంగతి తెలిసిందే కదా పోలీసులు ఇలాంటి వీడియోలు చేస్తే వెంటనే వైరల్ చేసేస్తారు.

అంతేకాక ఈ వీడియోకి బోలెడన్ని కామెంట్స్ తో పాటు లైక్స్ కూడా వచ్చాయి. ఇక ఇదే ఆమె ఉద్యోగానికి ఎసరి పెట్టిందని చెప్పాలి. ఈ వీడియో పోలీస్ శాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. అంతేకాక డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీంతో కానిస్టేబుల్ ఆర్థి కూడా ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో స్థానికంగా ఈ న్యూస్ చర్చనియాం శంగా మారింది. ఇక ఈ వీడియోను ఆదిత్య తివారి అనే వ్యక్తి తన ట్విట్టర్ వేదికగా విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.