Telangana IT Minister : తెలంగాణకు ఐటి మినిస్టర్ ఎవరు…?

Telangana IT Minister  : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మిత్రపక్షంతో కలిసి 65 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. హంగుకు ఆస్కారం లేకుండా పూర్తి మెజారిటీతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి హారతి పట్టారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది. కాగా ఇవాళ సిఎల్పీ వేదిక తర్వాత సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది […]

  • Published On:
Telangana IT Minister : తెలంగాణకు ఐటి మినిస్టర్ ఎవరు…?

Telangana IT Minister  : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మిత్రపక్షంతో కలిసి 65 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. హంగుకు ఆస్కారం లేకుండా పూర్తి మెజారిటీతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి హారతి పట్టారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది. కాగా ఇవాళ సిఎల్పీ వేదిక తర్వాత సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు తెలంగాణకు కాబోయే సీఎం ఎవరు అనేది కన్నా , తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ఐటి మినిస్టర్ ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇదే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రెండుసార్లు కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

who-is-the-it-minister-of-telangana

ఇక ఈ రెండు సార్లు కూడా ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే . కేటీఆర్ తన సమర్థతతో ఐటీ పరిశ్రమలకు కొత్త వన్నె తీసుకొచ్చారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఎదగాలని తొలి సంవత్సరంలోనే టీ హబ్ అనే వేదికకు అంకురార్పణ చేశాడు. అయితే ఇదంతా కేవలం కేటీఆర్ ఆలోచనల నుండి పుట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఏడు సంవత్సరాలలో టీ హబ్ ప్రపంచ స్థాయి స్టార్ట్ అప్ కు వేదికగా నిలిచింది. అంతేకాక కేటీఆర్ ఐటి శాఖను కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా కరీంనగర్, ఖమ్మం వంటి నగరాలకు కూడా వ్యాపింపచేశారు. ఇక ఈ ఘనత కచ్చితంగా కేటీఆర్ దే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఐటీ శాఖలు మాత్రమే కాకుండా ఫార్మా ,ఆటోమొబైల్ వంటి పరిశ్రమలు కూడా అభివృద్ధి చేసే విధంగా కేటీఆర్ దోహదపడ్డారు. ఎన్నో విధాలుగా ప్రతిష్టాత్మకమైన పనులను చేపట్టిన కేటీఆర్ ఇప్పుడు లేకపోవడం నిజంగా దురదృష్టకరం. మరి కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు ఐటీ శాఖకు మంత్రిగా ఎవరు వ్యవహరిస్తారు..? కేటీఆర్ మాదిరిగా సమర్ధవంతంగా పని చేస్తారా లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి ఐటీ మినిస్టర్ గా దుద్దెల శ్రీధర్ బాబుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీధర్ కు గతంలో మినిస్టర్ చేసిన అనుభవం మరియు ఉన్నత విద్య ఉండడం వలన ఈ అవకాశం అతనికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మరి కాంగ్రెస్ పార్టీ ఐటీ మినిస్టర్ గా ఎవరిని నియమిస్తుందో వేచి చూడాల్సిందే..