Uttam Kumar Reddy : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం… రేవంత్ ని సీఎం చేస్తే నేను మంత్రిగా చేయలేను…

Uttam Kumar Reddy  : తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయ్యేది ఎవరు.ఐ కమాండ్ కు ఈ ఎంపిక పరీక్షగా మారింది. రేవంత్ సీఎం అంటూ జరిగిన ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గుర్రుమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న తమనీ పరిగణలోకి తీసుకోకుండా ఈ లీక్స్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఐ కమాండ్ పిలుపుతో బట్టి ,ఉత్తంకుమార్ […]

  • Published On:
Uttam Kumar Reddy  : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం… రేవంత్ ని సీఎం చేస్తే నేను మంత్రిగా చేయలేను…

Uttam Kumar Reddy  : తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయ్యేది ఎవరు.ఐ కమాండ్ కు ఈ ఎంపిక పరీక్షగా మారింది. రేవంత్ సీఎం అంటూ జరిగిన ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గుర్రుమంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న తమనీ పరిగణలోకి తీసుకోకుండా ఈ లీక్స్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఐ కమాండ్ పిలుపుతో బట్టి ,ఉత్తంకుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం జరిగింది. అయితే తాజాగా హై కమాండ్ కొత్త ఫార్ములాను తెరమీదకు తెచ్చినట్లుగా అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ కొనసాగుతోంది. సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి వైపు హై కమాండ్ మొగ్గు చూపుతుంటే ఈ సమాచారం తెలుసుకున్న సీనియర్లు ఇప్పుడు ఒకటయ్యారు.

uttam-kumar-reddy-sensational-comments-on-revanth-reddy

ఈ నేపథ్యంలోనే వారంతా ముందుగా డీకే శివకుమార్ తో వారి అభిప్రాయాలను స్పష్టం చేశారు. డీకే శివకుమార్ సూచనలతో సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ల ఆరోపణలను డీకే శివకుమార్ హై కమాండ్ నివేదించారు. దీంతో పార్టీ హై కమాండ్ సూచనలు మేరకు డీకే శివకుమార్ మరియు పార్టీ పరిశీలకులు ఢిల్లీకి చేరుకున్నారు.అయితే తాజాగా బట్టి మరియు ఉత్తంకుమార్ రెడ్డికి పిలుపు రావడంతో రాజకీయం మరింత రసంతరంగా మారింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అంటూ మీడియాకు లీకులు ఇవ్వడం పైన వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాను పార్టీ గెలుపు కోసం కష్టపడ్డానని తనకు సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారు.

uttam-kumar-reddy-sensational-comments-on-revanth-reddy

పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తానని భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలను తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు సీఎం పదవి తప్ప మరో పదవి అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ సీఎం అయితే తాను మంత్రిగా పనిచేయలేనని ఉత్తంకుమార్ రెడ్డి అసహన వ్యక్తం చేయగా డీకే శివకుమార్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే తనకు సీఎం పదవి ఇవ్వకపోతే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలతో మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తంకుమార్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా సమాచారం. అదేవిధంగా తనకు సీఎం పదవి ఇవ్వకపోతే పీసీసీ చీఫ్ పదవితోపాటు కీలక శాఖలతో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని బట్టి కూడా కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ అంతర్గత యుద్ధంలో ఎవరికి ఎలాంటి పదవులు వస్తాయో ఎవరు సీఎం అవుతారో ఎవరికి అంతుపట్టడం లేదు.