Telangana New Ration Card : కొత్త రేషన్ కార్డ్ కావాలనుకునేవారు అభయ హస్తం దరఖాస్తు ఫామ్ లో ఇక్కడ రాయండి…ఇదిగో వీడియో…

Telangana New Ration Card : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజా పాలన అభయహస్తం ఫొర్మ్ బాగా వినిపిస్తోంది.దీంతో ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా దరఖాస్తు నింపే పనులు నిమగ్నమయ్యారు. అదేవిధంగా ప్రజలంతా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటీల ను ,పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చే ఆరు గ్యారెంటీలు రావాలంటే జనవరి 6 2024 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ 6 గ్యారంటీలకు […]

  • Published On:
Telangana New Ration Card : కొత్త రేషన్ కార్డ్ కావాలనుకునేవారు అభయ హస్తం దరఖాస్తు ఫామ్ లో ఇక్కడ రాయండి…ఇదిగో వీడియో…

Telangana New Ration Card : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజా పాలన అభయహస్తం ఫొర్మ్ బాగా వినిపిస్తోంది.దీంతో ప్రస్తుతం తెలంగాణ ప్రజలంతా దరఖాస్తు నింపే పనులు నిమగ్నమయ్యారు. అదేవిధంగా ప్రజలంతా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటీల ను ,పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చే ఆరు గ్యారెంటీలు రావాలంటే జనవరి 6 2024 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ 6 గ్యారంటీలకు అర్హత పొందాలంటే కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే. తెల్ల రేషన్ కార్డు లేనిచో ఈ 6 గ్యారంటీలకు అర్హత లభించదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలామంది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే రేషన్ కార్డు లేని వారు అభయ హస్తం ఫామ్ లోనే కొత్త రేషన్ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చు.

those-who-want-to-get-new-ration-card-write-in-abhaya-hastam-application-form-here

అయితే అభయహస్తం ఫామ్ లో రేషన్ కార్డ్ దరఖాస్తు కోసం ప్రత్యేకించి దరఖాస్తు ఇవ్వలేదు కాబట్టి మాకు రేషన్ కార్డు కావాలి అని ముందుగానే మొదటి పేజీలో రాయాల్సి ఉంటుందట.అయితే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్న వారు అప్లికేషన్ నెంబర్ ను ప్రజా పాలన అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ పేజీలో రాయాల్సి ఉంటుంది. ఇక ఆ ఫామ్ లో రేషన్ కార్డు అని రాసిన వారికి కొత్త రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందట. ఇక ఈ విషయాలను అధికారులు తనిఖీ చేసుకొని ఇంటికి వచ్చి పూర్తిగా వివరాలు తెలుసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డ్ జారీ చేయనున్నట్లు సమాచారం.కావున కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేవారు ఎలాంటి సతమతం లేకుండా అభయ హస్తం ఫామ్ లోని ఫస్ట్ పేజీలోనే రేషన్ కార్డు కావాల్సిందిగా పేర్కొనాల్సి ఉంటుంది.