Revanth Reddy First Signature : ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సంతకం చేసే తొలి ఫైల్ ఇదే…

Revanth Reddy First Signature : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆ వేదికపై నుండే ముఖ్యమంత్రిగా ఫైల్ ఫై తొలి సంతకం చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలపై ముఖ్యమంత్రిగా రేవంత్ తొలి సంతకం చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా రాజకీయంగా తొలి నియామకం కూడా ఖరారైంది. మంత్రివర్గంపై కసరత్తు చేసిన రేవంత్ రెడ్డి హై కమాండ్ ఆమోదం కూడా తీసుకున్నారు. […]

  • Published On:
Revanth Reddy First Signature : ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సంతకం చేసే తొలి ఫైల్ ఇదే…

Revanth Reddy First Signature : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆ వేదికపై నుండే ముఖ్యమంత్రిగా ఫైల్ ఫై తొలి సంతకం చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలపై ముఖ్యమంత్రిగా రేవంత్ తొలి సంతకం చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా రాజకీయంగా తొలి నియామకం కూడా ఖరారైంది. మంత్రివర్గంపై కసరత్తు చేసిన రేవంత్ రెడ్డి హై కమాండ్ ఆమోదం కూడా తీసుకున్నారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం.

this-is-the-first-file-signed-by-revanth-reddy-as-chief-minister-after-taking-oath

తోలి సంతకం…

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిగా అధికారంలోకి వస్తే తాము చేస్తామని చెప్పిన గ్యారెంటీలను అమలు చేసే ఫైల్ పై రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నట్లు సమాచారం. ఇక దీనిని పార్టీ అగ్రనేతలు , అతిధులు ,కొత్త మంత్రులు పార్టీ శ్రేణుల సమక్షంలో చేయాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అయితే 2004లో వై.యస్.ఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పైన సంతకం చేశారు. ఇక ఇప్పుడు రేవంత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ఫైల్ పై సంతకం చేయనున్నారు. ఆ తర్వాత తొమ్మిదవ మంత్రి వర్గ సమావేశంలో ఈ పథకాల అమలును , తీరు తెన్నులను చూడనన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు రేవంత్ కు సవాల్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలంటే ఏడాదికి దాదాపు లక్ష కోట్ల వరకు ఖర్చవుతుంది. దీని కారణంగా ఈ గ్యారెంటీలను అమలు చేసేందుకు నిధుల సమీకరణ రేవంత్ కు పెద్ద సవాల్ గా మారుతుంది. అంతేకాదు పాలనాపరంగా కూడా అనేక రకాల సవాళ్లు రేవంత్ ముందున్నాయి. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వీటన్నింటిని ఎలా ఎదుర్కొంటాడో..రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడో వేచి చూడాలి…