KCR : కెసిఆర్ భారీ బహిరంగ సభకు అడ్డుపడుతున్న రేవంత్ సర్కార్…

KCR : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాజాగా కృష్ణ ప్రాజెక్టులను KRMB కి అప్పగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టులపై బిఆర్ఎస్ మధ్య మరియు కాంగ్రెస్ మధ్య డైలాగ్ వారు నడుస్తుంది. ఇక ఇదే అంశంపై నల్లగొండలో ఫిబ్రవరి 3వ తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ భారీ బహిరంగ సభ ద్వారా కెసిఆర్ కూడా రి ఎంట్రీ […]

  • Published On:
KCR : కెసిఆర్ భారీ బహిరంగ సభకు అడ్డుపడుతున్న రేవంత్ సర్కార్…

KCR : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తాజాగా కృష్ణ ప్రాజెక్టులను KRMB కి అప్పగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టులపై బిఆర్ఎస్ మధ్య మరియు కాంగ్రెస్ మధ్య డైలాగ్ వారు నడుస్తుంది. ఇక ఇదే అంశంపై నల్లగొండలో ఫిబ్రవరి 3వ తారీఖున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ భారీ బహిరంగ సభ ద్వారా కెసిఆర్ కూడా రి ఎంట్రీ ఇవనున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ బహిరంగ సభ 2 లక్షల మందితో బిఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసిందని సమాచారం.ఇలాంటి తరుణంలో నల్గొండ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ 1861 , సెక్షన్ 30 ,30a అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఎస్పీ చందన దీప్తి ప్రకటన కూడా విడుదల చేశారు.ఇక ఈ చట్టం ప్రకారం పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా జిల్లాలో ఎలాంటి ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని వారు తెలియజేశారు. అయితే బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకువచ్చిందని బిఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. భారీ బహిరంగ సభను కచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పుకొస్తున్నారు.