KCR : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం…ఎప్పుడంటే…

KCR : గత సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం , కాంగ్రెస్ పార్టీ గెలవడం..కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించటం చక చక జరిగిపోయాయి. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన వారంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు గజ్వేల్ మరియు కామారెడ్డి నుండి పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గజ్వేల్ […]

  • Published On:
KCR : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం…ఎప్పుడంటే…

KCR : గత సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం , కాంగ్రెస్ పార్టీ గెలవడం..కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించటం చక చక జరిగిపోయాయి. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన వారంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ గారు గజ్వేల్ మరియు కామారెడ్డి నుండి పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గజ్వేల్ లో కేసీఆర్ గెలిచారు. అయితే గజ్వేల్ లో గెలిచిన కేసీఆర్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. దీనికి గల కారణం కొద్దిరోజుల క్రితం ఫామ్ హౌస్ లో కెసిఆర్ కాలుజారి పడటం అని చెప్పాలి.అయితే గత ఏడాది డిసెంబర్ లో కెసిఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి పడటంతో కుటుంబ సభ్యులు కేసీఆర్ ను హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు.

kcrs-oath-taking-as-mla-when

ఇక అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కెసిఆర్ తొంటి ఎముక విరిగిందని శాస్త్ర చికిత్స చేసి తుంటి ఎముక మార్పిడి చేశారు. అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన కేసీఆర్ డిస్ఛార్జ్ అయిన తర్వాత నంది నగర్ లోని ఆయన నివాసంలో ఉంటున్నారు.ఇలా అనారోగ్యం కారణంగా ఇప్పటివరకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. దీంతో కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే విషయంపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. అయితే తాజాగా కెసిఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని విషయం పై ఆయన కుమారుడు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. తాజాగా మీడియాతో ముచ్చుటించిన ఆయన ఈ విషయంపై స్పందిస్తూ త్వరలోనే కెసిఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలియజేశారు. మంచి ముహూర్తం చూసి తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు.అతి త్వరలోనే ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం తేదీ ఉంటుందని ఆయన ప్రకటించారు. అదే విధంగా వచ్చే నెల ఫిబ్రవరి 17 కెసిఆర్ బర్త్డే వస్తుంది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు విచేస్తాడని కేటీఆర్ వెల్లడించారు.