Gas Cylinder : 500 కే గ్యాస్ సిలిండర్ పై సర్కార్ కసరత్తు…ఎవరెవరికి ఇస్తారంటే…

Gas Cylinder : అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రచారాలలో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే దీనిలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ , ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి గ్యారెంటీలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 500 కే గ్యాస్ సిలిండర్ హామీపై కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పౌరసరపర శాఖ రెండు కీలక ప్రతిపాదనలను విడుదల చేసింది. దానిలో మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు […]

  • Published On:
Gas Cylinder : 500 కే గ్యాస్ సిలిండర్ పై సర్కార్ కసరత్తు…ఎవరెవరికి ఇస్తారంటే…

Gas Cylinder : అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రచారాలలో ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే దీనిలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ , ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి గ్యారెంటీలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు 500 కే గ్యాస్ సిలిండర్ హామీపై కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పౌరసరపర శాఖ రెండు కీలక ప్రతిపాదనలను విడుదల చేసింది. దానిలో మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేనివారిలో కూడా అర్హులను ఎంపిక చేయడం… ఇక రెండవది రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి.ఇక దీనిలో వివిధ రకాల కంపెనీ వినియోగదారులు ఉన్నారు. ఇక రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలు దాదాపు 90 లక్షల వరకు ఉన్నాయి. అయితే తొలి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటే..

ఈ పథకాన్ని త్వరగా అమలు చేయవచ్చని అయితే అనర్హులు లబ్ధిదారులు అయ్యే అవకాశం ఉంటుందని..మొత్తంగా సుమారు కోటి కనెక్షన్లకు 500 కే సిలిండర్ ఇవ్వాల్సి రావచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది పౌర సరపర శాఖ. ఇక రెండో ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటే రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులు ఎంపిక అంత ఈజీ కాదని దానికి చాలా సమయం పట్టొచ్చు అని భావిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు. అలాగే ఉజ్వల్ కనెక్షన్లకు 340 రాయితీ అందిస్తుంది ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉజ్వల్ వి దాదాపు 11.5 లక్షలు ఉన్నాయి. గివ్ ఇట్ అప్ లో భాగంగా 4.2 లక్షలు మంది రాయితీని వదులుకున్నారు. మిగిలిన వినియోగదారులలో ఈ పథకానికి ఎవరిని ఎంపిక చేస్తారు అనే అంశంపై ప్రభుత్వం యొక్క ఆర్థిక భారం ఆధారపడి ఉంది.

అయితే 500 రూపాయలకు ఏడాదికి ఆరు సిలిండర్లు ఇస్తే రూ.2,225 కోట్లు , అదే ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చినట్లయితే రూ.4,450 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది.  ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరూ ఆరు గ్యారెంటీ ల అమలు కోసమే ఎదురుచూస్తున్నారు. ఇక దానికి తగినట్లుగానే ప్రభుత్వం కూడా వాటిని నెరవేర్చి దిశగా అడుగులు వేస్తుంది. అయితే వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన సర్కార్ తాజాగా 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకంపై కసరత్తు చేస్తుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు ఈ కేవైసీ చేసుకోకపోతే సిలిండర్ రాదు అని ప్రచారంతో ఆందోళన చెందిన లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు బారులు తీరారు. అయితే గ్యాస్ ఏజెన్సీ వద్దకు రావాల్సిన అవసరం లేదనిడెలివరీ బాయ్ వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. అదేవిధంగా ఈ కేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి తుదిగడువు నిర్ణయించలేదని తెలియజేసింది.