Madhapur Sai Kumari Aunty : ఓర్వలేక కేసు పెట్టారు అందుకే నా ఫుడ్ పాయింట్ ఆగిపోయింది…

Madhapur Sai Kumari Aunty : యూట్యూబ్ లో ఫేమస్ అయినా స్ట్రీట్ ఫుడ్ కుమారి అంటీ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆమె పై కేసు నమోదు అవ్వడానికి గల కారణం సోషల్ మీడియా లో ఆమె క్రేజ్ అని చెప్పాలి. అదేంటి అని అనుమానం వచ్చింది కదా నిజానికి ఆమె ఫేమస్ కావడమే అసలు సమస్య. అది ఎలా అంటే ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ […]

  • Published On:
Madhapur Sai Kumari Aunty : ఓర్వలేక కేసు పెట్టారు అందుకే నా ఫుడ్ పాయింట్ ఆగిపోయింది…

Madhapur Sai Kumari Aunty : యూట్యూబ్ లో ఫేమస్ అయినా స్ట్రీట్ ఫుడ్ కుమారి అంటీ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆమె పై కేసు నమోదు అవ్వడానికి గల కారణం సోషల్ మీడియా లో ఆమె క్రేజ్ అని చెప్పాలి. అదేంటి అని అనుమానం వచ్చింది కదా నిజానికి ఆమె ఫేమస్ కావడమే అసలు సమస్య. అది ఎలా అంటే ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యారు. సెన్సేషన్ గా మారిపోయింది. దీంతో యువత అంతా ఆమె దగ్గర భోజనం చేసేందుకు ఎగబడి పోతున్నారు. దీంతో రద్ది ఎక్కువ అయి వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది. అది కాస్త ఇప్పుడు పోలీసులకి ఎక్కడ లేని నొప్పిగా మారింది.

ఇంకేముంది ట్రాఫిక్ జామ్ కి కారణమైన కుమారి ఆంటీ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఏపీలోని గుడివాడకు చెందిన దాసర సాయికుమారి హైదరాబాద్ మాదాపూర్ లోని కోహినూర్ హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ ప్రారంభించారు. వెజ్ నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ పేరు తెచ్చుకున్నారు. మొదటిలో 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకి 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతుందట.

అయితే అక్కడ జనాలు ఎక్కువగా ఆమె దగ్గరకు రావడం గమనించిన కొందరు ఫుడ్ బ్లాగ్స్ ఆమెను వీడియోలు తీసి పెట్టడంతో ఆమె ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఇక ఆ వీడియోలు వైరల్ అవడంతో కేవలం యువత మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల మధ్య నడుస్తుంది. ఫ్రైడ్ రైస్ , బాగారా రైస్ ,లెమన్ రైస్, గోంగూర రైస్, గోబీ రైస్ ,జీరా రైస్ , పెరుగన్నం ఆంటీ స్పెషల్. ఇక నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ,లివర్ కర్రీ, మటన్ కర్రీ, బోటి కర్రీ ,తలకాయ కూర, చాపల కూర, ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీని ఆంటీ దగ్గర బాగా ఫేమస్.