Jaya Prakash Narayana : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సంతోషమే…మరి ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి…?

Jaya Prakash Narayana  : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సంతోషమే కానీ 6 గ్యారంటీల పరిస్థితి ఏంటి అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జయప్రకాశ్ నారాయణ గారు కాంగ్రెస్ హామీల గురించి వివరణ ఇస్తూ ఓ వీడియో ని విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ….తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.ఈ […]

  • Published On:
Jaya Prakash Narayana : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సంతోషమే…మరి ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటి…?

Jaya Prakash Narayana  : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సంతోషమే కానీ 6 గ్యారంటీల పరిస్థితి ఏంటి అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జయప్రకాశ్ నారాయణ గారు కాంగ్రెస్ హామీల గురించి వివరణ ఇస్తూ ఓ వీడియో ని విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ….తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.ఈ హామీలు నెరవేరాలంటే ఏడాదికి దాదాపు 70 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. కేవలం తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం పథకాలకు మాత్రమే ఇంత ఖర్చవుతుంది. ఇక దీనిలో రుణమాఫీలను కలపలేదంటూ ఆయన తెలియజేశారు.

jaya-prakash-narayana-sensational-comments-on-congress-party

దానిని కూడా కలిపి ఉంటే ఇంకాస్త భారం పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అలాగే దళిత బంధు పథకాన్ని అసలు ఆలోచన లేకుండా ప్రవేశపెట్టారు. నేను ఆరోజుల్లోనే కేసీఆర్ కు పిలుపునిచ్చాను. హుజురాబాద్ ఎన్నికల్లో దళితులందరికీ 10 లక్షల రూపాయలు పంచారు. ఆ సమయంలో ఇలా డబ్బు పంచడం సరైన పద్ధతి కాదని వారికి సరైన దిశగా అవకాశాలు కల్పిద్దాం, విద్య, వైద్యం అందిద్దాం అనే విషయాలను నేను తెలియజేశాను . ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి అనాలోచితంగా దానిని 12 లక్షలు చేస్తామని చెప్పింది.ఇక ఈ ఒక్క హామీకే బహుశా 2 లక్షల 30 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఏడాదికి 45 -50 వేల కోట్ల వరకు ఈ ఒక్క హామీకి సరిపోతుంది.

ఇలా చూస్తే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే ఖర్చు కంటే అదనంగా 1లక్ష 30 వేల కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనిని హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చింది. నేను కచ్చితంగా చెప్పగలను ఇది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉరితాడు అవుతుంది. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది వీటిలో ఆచరణలో పెట్టగలిగేవి మాత్రమే సరిచేసుకుని సరైన పాలన చేయండి. అసాధ్యమైనవి ప్రజల ముందు నిజాయితీగా చెప్పి వాటిని పక్కన పెట్టి సరైన దిశగా అడుగులు వేయండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి జయప్రకాష్ నారాయణ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలియజేశారు..ఆ విషయాలను కింద ఉన్న వీడియోలో వీక్షించవచ్చు.