Harish Rao : నీకు చేతకాకపోతే పక్కకి తప్పుకో…రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు…

Harish Rao  : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరోసారి బీఆర్ఎస్ నేత మాజీమంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డను రిపేర్ చేయలేమంటున్నారు రేవంత్ రెడ్డి నీకు చేతకాకపోతే పదవి నుంచి తప్పుకో నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తానంటూ మేడిగడ్డ నుండి నీళ్లను ఎత్తిపోసే బాధ్యతను నేను తీసుకుంటానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి… తాజాగా బుధవారం రోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన హరీష్ […]

  • Published On:
Harish Rao : నీకు చేతకాకపోతే పక్కకి తప్పుకో…రేవంత్ రెడ్డి పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు…

Harish Rao  : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరోసారి బీఆర్ఎస్ నేత మాజీమంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డను రిపేర్ చేయలేమంటున్నారు రేవంత్ రెడ్డి నీకు చేతకాకపోతే పదవి నుంచి తప్పుకో నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తానంటూ మేడిగడ్డ నుండి నీళ్లను ఎత్తిపోసే బాధ్యతను నేను తీసుకుంటానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి… తాజాగా బుధవారం రోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేడిగడ్డను భూతద్దంలో పెట్టి చూస్తున్నారని బ్యారేజీ పునరుద్ధరణ పై మాత్రం దృష్టి పెట్టడం లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అలాగే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయిందని ఆనాటి పరిస్థితులను హరీష్ రావు గుర్తు చేశారు. అంతేకాక సింగూరు డ్యాం , ఎల్లంపల్లి , సత్నాల, పులిచింతల , పొట్టంగండి గేట్లు కూడా కొట్టుకుపోవడం మనం చూసామని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంజాగుట్ట లో ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే కూలిందన్నారు. ఇక అప్పుడు వాటన్నింటినీ కప్పిపుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కావాలనే కాలేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రెండు పంటలకు నీళ్లు వచ్చేయా లేదా రైతులను అడిగి తెలుసుకోవాల్సిందిగా హరీష్ రావు ముఖ్యమంత్రి కి సవాల్ విసిరారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం జరిగిందని ఈ వాస్తవాలను కాంగ్రెస్ పార్టీ దాచిపెట్టి తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఇక కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి కి కేవలం 13 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని ఆ లెక్కలతో సహా హరీష్ రావు వివరించారు. ఇక తాము వచ్చిన తర్వాత కల్వకుర్తిలో 3.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లుగా ఆయన తెలిపారు.

ఈ క్రమంలోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ పై విచారణలు జరిపి బాధ్యతలు చర్యలు తీసుకోవాల్సిందిగా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బ్యారేజీ పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. ఆలస్యం చేస్తే ప్రజలకు సాగునీరు అందక ఇబ్బందులు పడతారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయాలు చేస్తూ తమపై బురద చల్లుతుందని కాలేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే అన్నట్లుగా ప్రచారాలు చేస్తున్నారని అది ఏమాత్రం మంచిది కాదని హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లడం మానేసి కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు చెప్పారు.